Read more!

English | Telugu

నాగార్జున పేరుతో చీప్ పాలిటిక్స్!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మే 13నే పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో.. కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హీరో అక్కినేని నాగార్జున పేరుతో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది.

"సినిమా వాళ్ళం హైదరాబాద్ లో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదు. నన్ను టీడీపీ తరపున మాట్లాడమని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ జగన్ గారి గవర్నమెంట్ బాగానే ఉంది. అందుకే ఇండస్ట్రీ నుండి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు." అని నాగార్జున అధికార పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేసినట్లుగా ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అసలు నాగార్జున ఇలాంటి స్టేట్ మెంటే ఇవ్వలేదు. నాగార్జునపై వస్తున్న రూమర్ పూర్తిగా అవాస్తవం అని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా ఉండాలని కోరింది.