English | Telugu

త్రిష అతి తెలివి

వరుణ్ కి ఉంగరం తొడిగాక త్రిషకు లక్కు తన్నుకొచ్చినట్టుంది. అప్పటి వరకూ అమ్మడి ముఖం చూడని దర్శకనిర్మాతలు క్యూ కట్టేశారు. బాలయ్యతో నటించిన లయన్ విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ ఏడాదికి సరిపడా ఆఫర్స్ సిద్ధంగా ఉన్నాయి. అయితే రేపో మాపో పెళ్లిముహూర్తం ఎనౌన్స్ చేస్తుంది అనుకుంటే సీన్ రివర్సయ్యేట్టు కనపడుతోంది. కొంపతీసి క్లోజ్ ఫ్రెండ్ నయనతారను ఫాలో అవుతోందా? పీటలమీద పెళ్లి వద్దంటుందా? అని కోలీవుడ్ లో ఒకటే గొడవ. ఇంతకీ మేటర్ ఏంటంటే....ఓ సినిమా వీళ్లిద్దరి మధ్యా చిచ్చుపెట్టిందట. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం ఎందుకులే అనుకున్నాడో ఏమో....త్రిషముందు ప్రపొజల్ పెట్టాడట కాబోయే భర్త వరుణ్. అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని అనుకుంటే...డేట్స్ ఖాళీ లేవ్ అని సింపుల్ గా చెప్పేసిందట. దీంతో వరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఉడ్బీ తీరు ఊహించని వరుణ్ అప్ సెట్ అయ్యాడట. పైగా కొద్దిరోజులుగా త్రిష పేరెత్తితే మండిపడుతున్నాడట. ఎంతపని చేశావ్ త్రిష అంటే....కాబోయే భర్త సినిమాలో నటిస్తే డబ్బులిస్తాడా ఏంటి? అవే డేట్స్ మరో డైరెక్టర్ కు ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెరుగుతుందని క్లోజ్ ఫ్రెండ్స్ తో చెప్పిందట. దీంతో చెన్నై చంద్రం అతి తెలివిచూసి తమిళ జనాలు ముక్కునవేలేసుకున్నారు. పిల్ల తీరు చూస్తుంటే అతి తెలివి ప్రదర్శించి వరుణ్ కి బై చెప్పేట్టే ఉందంటున్నారు. మరి త్రిష మనసు మార్చుకుంటుందేమో చూద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.