English | Telugu

The Paradise Glimpse : ఇది ఒక ల** కొడుకు కథ.. ఇదెక్కడి అరాచకం నాని..!

The Paradise Glimpse : ఇది ఒక ల** కొడుకు కథ.. ఇదెక్కడి అరాచకం నాని..!

 

'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడిగా శ్రీకాంత్ కి 'దసరా' ఫస్ట్ మూవీ అయినప్పటికీ, అందులో హీరో నానిని చూపించిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు. 'ప్యారడైజ్'లో నానిని ఇంకెంత కొత్తగా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అందుకు తగ్గట్టే.. గ్లింప్స్ తోనే షాక్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. (The Paradise Glimpse)

 

'రా స్టేట్ మెంట్' పేరుతో ప్యారడైజ్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. వంద సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్.. బిగ్ సర్ ప్రైజ్ లా ఉంది. ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న నాని.. ఇంతటి రా సినిమా, ఇలాంటి పూర్తి డిఫరెంట్ రోల్ చేస్తాడా? అని ఆశ్చర్యపోయేలా ఈ  గ్లింప్స్ ఉందని చెప్పవచ్చు. "చరిత్రలో అందరు చిలకలు, పావురాల గురించి రాసిన్రు కానీ, అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే" అంటూ గ్లింప్స్ ప్రారంభమైంది. "ఇది కడుపు మండిన కాకుల కథ. అమ్మ రొమ్ములో పాలులేక, రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఇది కాకులను ఒక్కటి చేసిన ఒక ల** కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ." అంటూ కొడుకు గురించి తల్లి చెబుతుండగా.. హీరో నాని పాత్రను రివీల్ చేసిన తీరు అదిరిపోయింది. కండలు తిరిగిన దేహం, రెండు జడలు, మీసకట్టు, ముక్కుకి పుడకలతో.. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. నాని లుక్ చూసి అందరూ షాకైపోతున్నారు.

 

ప్యారడైజ్ గ్లింప్స్ టెక్నికల్ గా కూడా టాప్ క్లాస్ లో ఉంది. అనిరుధ్ మ్యూజిక్, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మేకర్స్ గ్లింప్స్ కే భారీగా ఖర్చు పెట్టారని అర్థమవుతోంది. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఇక గ్లింప్స్ లో మూవీ రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు. ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.