English | Telugu

విజనరీ మ్యాన్, తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

అత‌ని పేరులో సూర్యుడుంటాడు! అందుకే, ఆయ‌న కార‌ణంగా ఎంద‌రి జీవితాల్లోనో... చీక‌ట్లు తొలిగి వెలుగులు విర‌జిమ్మాయి! ఎంద‌రెంద‌రో చిన్నారుల గుండెలు నేటికీ ఆగ‌కుండా, అలిసిపోకుండా కొట్టుకుంటున్నాయి అంటే... ఆ సూరీడీ క‌రుణ కిర‌ణాలే కార‌ణం! అంతే కాదు, ఆయ‌న ర‌వియే కాక శంక‌రుడు కూడా! శంక‌ర అంటే... సంతోష‌మూ, ఆనంద‌మ‌ని అర్థం! అందుకేనేమో... ఆయ‌న‌తో అనుబంధం పొందిన ఎవ్వ‌రూ ఆనందం పొంద‌కుండా ఉండ‌లేరు! అందుకు సాక్ష్యం... ఎన్నెన్నో కుటుంబాల్లో నిత్యం త‌డుస్తోన్న గొంతుక‌లు! మ‌న ర‌విశంక‌ర్ స‌ర్ అందించిన త్రాగునీరే వాళ్ల క‌ళ్ల‌లోని ఆనంద‌పు క‌న్నీరు!
కంఠంనేని ర‌విశంక‌ర్... ఇదొక పేరు కాదు...
నేడు ఆర్దికంగా ఎటువంటి స‌మ‌స్య‌లు, స‌వాళ్లు లేకుండా చ‌దువుకుంటోన్న వంద‌లాది మంది పేద విద్యార్థుల... నాలిక మీద నాట్యమాడే... మంత్రం!
ప్ర‌జా సేవ‌కు... మాన‌వ సేవ రూపంలో.... మాధ‌వ సేవ‌కు... ప‌దివి, అధికారం త‌ప్ప‌క కావాలా? అస్స‌లు అక్క‌ర్లేదు అని నిరూపించారు ర‌విశంక‌ర్! ఆయ‌న ప‌ద‌వి కోస‌మో, ప‌ద‌వితోనో సేవ చేయ‌లేదు! ఆయ‌న‌కు సేవే ప‌ద‌వి! ఆప్తుల క‌ళ్ల‌లో కృత‌జ్ఞ‌తే... అధికారం! అందుకే, మ‌న ర‌విశంక‌రుడు... ఎల్ల‌లు లేని రాజు! ఎల‌క్ష‌న్లతో నిమిత్తం లేని.... రేడు!

కంఠంనేని అన్న ఇంటి పేరు సార్థ‌క‌మ‌య్యేలా... ఆయ‌న ఎన్నెన్నో కంఠాల్లో మార్మోగే... ఆప్త వాఖ్యం!
అయితే, జ‌న సేవ‌... ఆయ‌న హృద‌యం మాత్ర‌మే! ఆయ‌న మ‌స్తిష్కం పూర్తిగా భిన్నం! వ్యాపారం ఆయ‌న స‌హ‌జ విశేషం! దూర‌దృష్టి ఆయ‌న ప్ర‌త్యేక విజ‌య కార‌ణం! వాటి వ‌ల్లే ర‌విశంక‌ర్... ఇండియా న‌ట్టింట్లోకి ఇంకా ఇంట‌ర్నెట్ సాంకేతిక ల‌క్ష్మి సంపూర్ణంగా కుడి కాలుమోప‌క ముందే... ఎదురెళ్లి స్వాగ‌తించారు! ఒక విజ‌న్ తో... విజ‌య‌ల‌క్ష్మిని... ఆయ‌న తెలుగువ‌న్ రూపంలో పాతికేళ్ల కిందే ప్ర‌తిష్ఠాపించారు! ఇంట‌ర్నెట్, యూట్యూబ్, వీడియో కంటెంట్, డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ వంటి ప‌దాలు వింటే... అత్య‌ధిక శాతం భార‌తీయులు... డిక్ష‌న‌రీలు తిర‌గేసే రోజుల్లోనే... ర‌విశంక‌ర్ తొలి భార‌తీయ అంత‌ర్జాల వేదిక‌కి పురుడు పోశారు! అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎన్నో వేల మందికి నేరుగా, పరోక్షంగా... ఉపాధినీయ‌గ‌లిగారు!

కంఠంనేని ర‌విశంక‌ర్ ఒక క‌లువ అనుకుంటే.... ఆయ‌న‌కు ఎన్నో విధాల ప్రేర‌ణ‌నిచ్చి...వ్య‌క్తిగా, శ‌క్తిగా విర‌బూసేలా చేసిన వారు... తెలుగు దేశ‌పు చంద్రుడు! తెలుగు రాష్ట్రాల తేజ‌మైన మ‌న‌... చంద్ర‌బాబు నాయుడు! ఆయ‌న ప‌ట్ల త‌న‌కున్న అభిమానాన్ని, ఆరాధ‌నా భావాన్ని కంఠంనేని ర‌విశంక‌ర్... సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌... సాక్షిగా చాటుకున్నారు! అస‌లు నిన్న‌టి త‌రాన్ని తిరుగులేని విధంగా ప్ర‌భావితం చేసిన ఆ మ‌హోన్న‌త నాయ‌కుడ్ని... ఈ త‌రానికి మ‌న ర‌విశంక‌ర్ మ‌హోత్కృష్టంగా ప‌రిచ‌యం చేసిన తీరు... మ‌హాద్భుతం! అయితే, బాబు నుంచీ విజ‌న‌రీ విల‌క్ష‌ణాన్ని, వ్యాపార చైత‌న్యాన్ని, సామాజిక బాధ్య‌త‌ని, పేద‌ల కోసం ఆరాటాన్ని... అన్నీ పుణికిపుచ్చుకున్న ర‌విశంక‌ర్... ఆయ‌న నుంచే పోరాట త‌త్వాన్ని కూడా ప్రోది చేసుకున్నారు!

సైకోతో సై అంటే సై అని బ‌రి గీసి యుద్ధం చేశారు! జ‌గ‌న్ అక్ర‌మ కేసుల గ‌న్నుల ఎక్కుపెట్టినా... పాయింట్ బ్లాంక్ లో శ‌త్రువు క‌ళ్ల‌లోకి దీక్ష‌గా, తీక్ష‌ణంగా గురి చూశారు... మ‌న ర‌విశంక‌ర్! చివ‌ర‌కు జ‌గ‌న్నాట‌కాల క‌థలు కంచికి చేరాయి! కంఠంనేని వారి కంఠం మాత్రం... రైతుల ప‌క్షానా, రాజ‌ధాని అమ‌రావ‌తి ఆక్రంద‌న‌ల‌కు అండ‌గా... నిలుస్తూనే వ‌చ్చింది! ఆయ‌న సిల్వ‌ర్ స్క్రీన్ పై తెరిచిన‌... రాజ‌ధాని ఫైల్స్.... వైరి ప‌క్షాన్ని సిల్లీ ఫెలోస్ ని చేయ‌గ‌లిగాయి... జ‌నం ముందు! ద‌టీజ్... ర‌విశంక‌ర్!
తెలుగు వ‌న్ ఆయ‌న... సంస్థ‌! ఆయ‌నే... తెలుగులో నెంబ‌ర్ వ‌న్! ఎనీ డౌట్స్...