English | Telugu

రానా డ్రెస్ సెన్స్ అదుర్స్

రానా డ్రెస్ సెన్స్ అదుర్స్ అని అనుకోవాలి. రానా అంటే యువహీరో దగ్గుపాటి రామానాయుడు. ఎందుకంటే మన దేశంలోని "50 బెస్ట్ డ్రెస్స్ డ్ మెన్" లలో రానాని కూడా ఒకడిగా ఎన్నిక చేశారు. సిద్ధార్థ మాల్యా (లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా కుమారుడు), అజిత్, జివికేస్ కృష్ణ భూపాల్ తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారు. గత సంవత్సరం రామ్ చరణ్ తేజ కూడా ఈ లిస్ట్ లో స్థానం సంపాదించాడు. ఈసారి రానాకి ఆ స్థానం దక్కటం విశేషం. రానాకి ఆ స్థానం దక్కటానికి సరైన కారణమే ఉంది. రానా ఆరడుగుల మూడంగుళాల ఏత్తు. ఆ ఎత్తుకు తగ్గ వెడల్పైన భుజాలతో చాలా అందంగా, ఆకర్షణీయంగా కనపడతాడు. దానికితోడు అతనికి డ్రెస్సులపై కాస్త శ్రద్ధ ఎక్కువనే చెప్పాలి. ఏ సందర్భానికి ఎలాంటి డ్రెస్సు వేసుకోవాలి అనే స్పృహ రానాకి ఎక్కువే.

మన దేశంలో ఒకప్పుడు డ్రెస్సుల గురించి, అది కూడా మగవారు పట్టించుకోవటం అంతగా ఉండేది కాదు. కానీ నేటి పరిస్థితి వేరు. మన దేశంలోని మగవాళ్ళంతా హాలీవుడ్ స్టార్లకు కూడా పోటీ ఇచ్చే స్థాయిలో డ్రెస్సులను ధరిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న"నా ఇష్టం" అనే సినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా సరసన హాసిని పాప జెనీలియా డిసౌజా హీరోయిన్ గా నటిస్తూంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.