English | Telugu

ఆమెను గర్భవతిని చేశాడు.. దుమారం రేపుతున్న పూనమ్‌కౌర్‌ తాజా ట్వీట్‌!

వివాదాలకు, కాంట్రవర్షియల్‌ ట్వీట్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్న నటి పూనమ్‌ కౌర్‌.. తాజాగా చేసిన ట్వీట్‌ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తనకు సినిమా ఇండస్ట్రీలో చాలా అన్యాయం జరిగిందంటూ కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా ట్వీట్స్‌ చేస్తూ ఓ దర్శకుడ్ని టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. క్లారిఫికేషన్‌ అంటూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు పూనమ్‌. టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడు ఒక పంజాబీ నటి కెరీర్‌ మొత్తం నాశనం చేశాడని, ఆమెను గర్భవతిని చేసి చాలా అన్యాయం చేశాడని ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జోక్యంతో ఆమెకు కొంత సహాయం అందిందని తెలిపారు. అయితే తనను, పొలిటీషియన్‌గా మారిన ఓ నటుడ్ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని చెబుతోంది.

ఆ పంజాబీ నటికి అన్యాయం చేసింది రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కాదని, తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక ప్రముఖ దర్శకుడని తన ట్వీట్‌లో క్లారిఫై చేసింది పూనమ్‌. తనకు అన్యాయం జరిగిందంటూ ఎంతో కాలంగా రకరకాల ట్వీట్స్‌ పెడుతూ ఓ ప్రముఖ డైరెక్టర్‌ని పూనమ్‌ టార్గెట్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా వేసిన ట్వీట్‌లో మరోసారి అతనిపై విరుచుకుపడిరది. ఇప్పటికే రకరకాల వివాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పూనమ్‌ వేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో.. పంజాబీ నటికి అన్యాయం చేసిన ఆ దర్శకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.