English | Telugu

మ‌ళ్లీ తెలుగు మేక‌ర్స్ ని న‌మ్ముకున్న షాహిద్‌

మ‌ళ్లీ తెలుగు మేక‌ర్స్ ని న‌మ్ముకున్న షాహిద్‌

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ మ‌ళ్లీ తెలుగు ద‌ర్శ‌కుల మీదే హోప్స్ పెట్టుకున్నారు. ఆయ‌న కెరీర్‌లో క‌బీర్‌సింగ్‌కి ఉన్న ఇంపార్టెన్స్ తెలిసిందే. ఆ సినిమాను తెర‌కెక్కించింది తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా. ఆ సినిమా త‌ర్వాత బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్ మార్కెట్ మ‌రింత పెరిగింది. ఆ హైప్‌తోనే మ‌ళ్లీ తెలుగు డైర‌క్ట‌ర్ల‌కి ఓటు వేశారు షాహిద్‌.

షాహిద్ న‌టిస్తున్న వెబ్ సీరీస్ ఫ‌ర్జి. ఈ సీరీస్‌లో షాహిద్ క‌పూర్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, రాశీఖ‌న్నా, కేకే మీన‌న్ న‌టిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుందంటున్నారు వెబ్‌సీరీస్‌కి ప‌నిచేసిన వారు. త‌న తాత ప్రింటింగ్ ప్రెస్‌లో ప‌నిచేసే స్మాల్ టైమ్ ఆర్టిస్ట్, ఉన్న‌ప‌ళాన పెద్ద‌వాడైపోవాల‌నుకున్న‌ప్పుడు ఏం చేశాడు? అత‌న్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల‌నుకున్న టాస్క్ ఫోర్స్ ఆఫీస‌ర్ క‌థేంటి? అనే అంశాల‌తో  తెర‌కెక్క‌తోంది ఫ‌ర్జి. ఇంత‌కు ముందు ఈ త‌ర‌హా క‌థ వెబ్‌సీరీస్‌లో క‌నిపించ‌లేద‌న్న‌ది మేక‌ర్స్  మాట‌.

ఆల్రెడీ ఫ్యామిలీమేన్ సీరీస్‌తో త‌మ సత్తా నిరూపించుకున్న రాజ్ అండ్ డీకే తెర‌కెక్కిస్తున్న వెబ్ సీరీస్ ఇది. 2023 ఫిబ్ర‌వ‌రిలో ఓటీటీలో విడుద‌ల కానుంది. రాజ్ డీకే క‌థ చెబితే ఓకే అన‌ని ఆర్టిస్టులు ఇప్ప‌డు ప్యాన్ ఇండియా లెవ‌ల్లో ఎవ‌రూ లేరు. స‌మంత‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఓవ‌ర్‌నైట్ పాపుల‌ర్ చేసిన ఘ‌న‌త కూడా రాజ్ అండ్ డీకే కే చెందుతుంది. వారు చెప్పిన క‌థ న‌చ్చి షాహిద్‌, విజ‌య్ సేతుప‌తి ఈ ప్రాజెక్టుకు సైన్ చేశారు.వెబ్‌సీరీస్‌ల‌లో ఫ‌ర్జికి త‌ప్ప‌కుండా బెస్ట్ ప్లేస్ ద‌క్కుతుందంటోంది యూనిట్‌.