English | Telugu

స‌మంత పెళ్ల‌యిపోయిందా?

తెలుగు ప్రేక్ష‌కుల‌కు, స‌మంత అభిమానుల‌కూ ఇది షాకింగ్ న్యూసే. స‌మంత పెళ్ల‌యిపోయింద‌ట‌..! ఎవ‌రితో అంటారా..?? ఇంకెవ‌రు - సిద్దార్థ్‌తోనే. గ‌త రెండేళ్లుగా ఈ జంట ప్రేమ‌లో మునిగితేలుతున్నారు. త్వ‌ర‌లోనే సినిమాల‌కు స్వ‌స్తి చెప్పి పెళ్లి చేసుకొంటా అని ఈమ‌ధ్యే స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. అయితే నిజానికి స‌మంత - సిద్దార్థ్‌ల‌కు ఇది వ‌ర‌కే పెళ్ల‌యిపోయింద‌ని, ఇద్ద‌రూ చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో క‌ల‌సి ఉంటున్నార‌ని చెన్నై మీడియా చెబుతోంది. యేడాది క్రితం స్నేహితుల స‌మ‌క్షంలో ఉంగ‌రాలు మార్చుకొన్న ఈ జంట‌.. ఆ త‌ర‌వాత గుట్టు చ‌ప్పుడు కాకుండా వివాహం చేసుకొన్నార‌ట‌. అయితే చ‌ట్ట‌బ‌ద్ధంగా అంద‌రికీ చెప్పుకోవ‌డానికి కొన్ని అడ్డంకులున్నాయ‌ని అవి తొల‌గిపోయిన త‌ర‌వాత‌... మీడియా ముందుకు జంట‌గా వ‌స్తార‌ని చెప్పుకొంటున్నారు. స‌మంత షూటింగుల నిమిత్తం హైద‌రాబాద్ వ‌స్తే.. సిద్దార్థ్ కూడా వాలిపోతున్నాడ‌ట‌. ఇద్ద‌రూ క‌ల‌సి త‌ర‌చూ ఓ రెస్టారెంట్లో డిన్న‌ర్ చేస్తుంటార‌ని, చెన్నైలో మాత్రం ఒకే చోట ఉంటున్నార‌ని స‌మాచార‌మ్‌. ఈ వార్త‌లో నిజ‌మెంతో చెన్నై మీడియాకూ, స‌మంత‌, సిద్దార్థ్ ల‌కే తెలియాలి. నిజ‌మైతే.. స‌మంత, సిద్దార్థ్‌లు ఎంత కాలం దాస్తారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.