English | Telugu

సూపర్ స్టార్ ఫుల్ గా మందుకొట్టాడు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ 2002 ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసుకు సంబంధించి ఆయన మరో షాక్ తగిలింది. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రమాద సమయంలో సల్మాన్‌ఖాన్‌ తప్పతాగి వున్నాడంటూ ఫోరెన్సిక్‌ నివేదిక న్యాయస్థానానికి అందింది. సల్మాన్‌ఖాన్‌ 2002లో మద్యం తాగిన మత్తులో వాహనాన్ని వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పైకెక్కించేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు. అప్పటినుంచీ ఈ కేసు నుంచి తప్పించుకొనేందుకు సల్మాన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ప్రమాదం జరిగిన సమయంలో తాను కారు నడపలేదని చెప్పినా, ప్రత్యక్ష సాక్షులు ఆయనే కారు డ్రైవ్‌ చేశారని వ్యతిరేకంగా సాక్షం చెప్పడంతో ఇరుక్కుపోయాడు. ఇప్పటికైనా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చి, న్యాయస్థానం తుది తీర్పు అతి త్వరలో వెల్లడిస్తుందా? లేదో..!