English | Telugu

రౌడీ పాటలకు ముహూర్తం ఖరారు

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "రౌడీ". సాయి కార్తీక్ అందించిన ఈ చిత్ర ఆడియోను తిరుపతిలో మోహన్ బాబు "విద్యానికేతన్" లో ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మోహన్ బాబు ప్రత్యేకంగా ఓ సెట్ ను డిజైన్ చేయిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ఇందులో "సింహం అవ్వాలని ప్రతీ కుక్కకి ఉంటుంది... వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది." వంటి మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ అదరగొడుతున్నాయి. విష్ణు పాత్ర చాలా బాగుంది. పార్థసారధి, గజేంద్ర, విజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ, శాన్వి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.