English | Telugu

'కిక్ 2' ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌ కిక్ 2 సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ టాక్. రెండు తెలుగు రాష్ర్టాల్లోను క‌లిపి కిక్ 2 తొలి రోజు 7.2 కోట్ల షేర్ వచ్చిందట. రవితేజ సినిమాకు ఈ మేరకు రావడం కాస్త చెప్పుకోదగ్గర విషయమే. సురేంద్ర రెడ్డి రేసుగుర్రం ఎఫెక్ట్, రవితేజ పవర్ ఎఫెక్ట్, మాగ్జిమమ్ థియేటర్లలో విడుదల చేయడం ఈ సినిమాకు కలిసి వచ్చాయని చెప్పాలి. మొదటి మూడు రోజులు ఈ సినిమాకు షేర్ కూడా కాస్త ఎక్కువగా వుంటే బయ్యర్లు, నిర్మాత హ్యాపీ అవుతారు. కిక్ 2లో కంఫ‌ర్ట్ కాన్సెఫ్ట్ ప్రేక్ష‌కుల‌కు అంత కంఫ‌ర్ట్‌గా లేద‌న్న టాక్ వ‌స్తోంది. అలాగే బి సి ల్లో మంచి టాక్ వస్తుందని అంటున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.