Read more!

English | Telugu

రవితేజ దొంగ పోలీసా.. జాతి రత్నాలు డైరెక్టర్ చెప్పాల్సిందే  

ఏ సినిమాకి అయినా  టైటిల్ నే ప్రాణం.. సినిమా మీద ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ కలగాలన్నా, థియేటర్స్ కి రావాలన్నాటైటిల్ నే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసలు టైటిల్ తోనే సినిమా సగం విజయం సాధించినట్టే అనే సినీ నానుడి కూడా ఉంది. అంత శక్తి ఉంది టైటిల్ కి. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ (ravi teja) మూవీకి సంబంధించిన టైటిల్ ఒకటి టాక్ అఫ్ ది డే గా నిలిచింది

రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ దానికి  దర్శకుడు. మిరపకాయ తర్వాత రిపీటెడ్ కాంబో కావడంతో అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి.దీని తర్వాత  జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో చెయ్యబోతున్నాడు.ఇప్పుడు ఆ మూవీకి  దొంగ పోలీస్ (donga police) అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందనే  వార్తలు వస్తున్నాయి. 
త్వరలోనే ఆ విషయం మీద  అధికార ప్రకటన రానుంది. ఇక ఆ టైటిల్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు

ఎందుకంటే సీరియస్ అండ్ కామెడీ క్యారక్టర్ లలో  రవితేజ విజృంభించి  నటిస్తాడు.అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. పైగా అనుదీప్ పక్కా కామెడీ డైరెక్టర్. జాతి రత్నాలు తో కామెడీ లోనే ఒక నూతన ఒరవడిని సృష్టించాడు.దీంతో దొంగ పోలీసు కూడా సరికొత్త నవ్వులని పూయిస్తుందని నమ్ముతున్నారు. ఇండస్ట్రీ లో కూడా క్రేజీ కాంబోగా మారింది. రవితేజ కెరీర్ లో అది  75వ చిత్రం.సితార ఎంటర్ టైన్మెంట్స్ పై నాగ వంశీ  నిర్మిస్తున్నాడు. మరి ఇంతకీ దొంగ ఎవరు పోలీసు ఎవరు..లేక రెండు రవితేజ నేనా