Read more!

English | Telugu

టైగర్ నాగేశ్వరరావు స్పెషల్ అట్రాక్షన్ అదేనంటున్నారు!

మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రం చేస్తున్నారు. దీని తరువాత అయినా స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రం 1970 కాలంలో సాగుతుంది. దాన్ని బట్టి ఇది ఓ బ‌యోపిక్ మూవీగా రూపొంద‌నుంద‌ని అర్థమవుతుంది. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ర‌వితేజ కెరీర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా దీనిని పేర్కొన‌వ‌చ్చు. మ‌రోవైపు ఈ మూవీ ర‌వితేజ కెరీర్‌లో  తొలి పాన్ ఇండియా మూవీగా  నిలవనుంది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో నూపుర్ స‌న‌న్, గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ సామాజిక కార్య‌క‌ర్త పాత్ర‌ను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వ‌చ్చిన న్యూ అప్డేట్ రవితేజ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ మొత్తం మూడు గెట‌ప్ ల‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. యంగ్ అండ్ డైన‌మిక్ లుక్ లో ఓసారి, పెద్దగా గడ్డంతో మరో లుక్కులో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కానీ మూడో లుక్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ లుక్ చాలా సర్ప్రైజ్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ పోరాట ఘట్టంని కూడా పూర్తి చేశారు. 

ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. దాంతో తమిళంలో కూడా చిత్రంపై అంచనాలు ఉన్నాయి. వంశీ రవితేజ కాంబోలో వస్తున్న యాక్షన్ మూవీ పై భారీ అంచనాలైతే ఉన్నాయి. మొత్తానికి ధమాకా తో సూపర్ హిట్ కొట్టి 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి, చిరుతో క‌లిసి వాల్తేరు  వీర‌య్య‌గా 200 కోట్ల క్ల‌బ్లో చేరిన మాస్ మ‌హారాజా ర‌వితేజ స్టువ‌ర్ట్ పురంగ‌జ‌దొంగగా ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.