English | Telugu

చరణ్ బాబు.. తండ్రిగా నేను నిన్ను చూసి గర్వపడుతున్నా!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెలుగు తెరకు పరిచయమై నేటితో 18 ఏళ్ళు పూర్తయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన రామ్ చరణ్ మొదటి చిత్రం 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. నేటితో చరణ్ సినీ ప్రయాణం మొదలై, 18 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. (18 Years Of Ram Charan)

"చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…" అని చిరంజీవి రాసుకొచ్చారు.

చిరంజీవి తనయుడిగా 'చిరుత'తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తనయుడు చరణ్ ఎదుగుదల చూసి తండ్రిగా గర్వపడుతున్న చిరంజీవి.. తన ఆనందాన్ని అక్షరాల రూపంలో ఇలా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.