English | Telugu

లాల్ సలాం.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్! 

లాల్ సలాం.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్! 

విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'లాల్ సలాం'. లైకా ప్రొడక్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండం మెయిన్ హైలైట్‌. రీసెంట్‌గా ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా న‌టిస్తోన్న సూప‌ర్ స్టార్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయ‌గా సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ క్రికెట‌ర్‌ క‌పిల్ దేవ్‌ కూడా భాగం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజాగా ర‌జినీకాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో లెజెండ్రీ క్రికెట‌ర్‌, 1983లో తొలిసారి ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించిపెట్టిన నాటి కెప్టెన్ క‌పిల్ దేవ్‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారాయ‌న‌. "లెజెండ్రీ ప‌ర్స‌న్‌, మ‌నం అంద‌రం ఎంతో గౌర‌వించాల్సిన గొప్ప మ‌నిషి క‌పిల్ దేవ్‌జీతో క‌లిసి ప‌ని చేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. క్రికెట్ వ‌రల్డ్‌క‌ప్‌ను సాధించి మ‌న భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారాయ‌న‌" అంటూ కపిల్ దేవ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు ర‌జినీకాంత్‌. న‌ట‌న‌లో లెజెండ్రీ ప‌ర్స‌నాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్ర‌శంసిస్తూ చేసిన స‌ద‌రు ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రో వైపు క‌పిల్ దేవ్ సైతం ర‌జినీకాంత్‌తో ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ "ర‌జినీకాంత్‌ గారితో క‌లిసి ప‌ని చేయ‌టం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను" అన్నారు.