English | Telugu

రజనీ కాంత్ రాణా న్యూలుక్

రజనీ కాంత్ రాణా న్యూలుక్ పోస్టర్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న"రాణా" చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకులుగా, ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ "రాణా" చిత్రంలో రజనీ కాంత్ త్రిపాత్రాభినయం చేస్తూండగా దీపిక పదుకునే, ఇలియానా, విద్యాబాలన్ లు వంటి ప్రముఖ నటీమణులు ఆయన సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రానికి ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంథోనీ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఓచర్ పిక్చర్ ప్రొడక్షన్స్ మరియూ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు రెండూ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రజనీకాంత్ "రాణా" చిత్రం వచ్చే సంవత్సరం అంటే 2012 లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.రజనీ కాంత్ "రాణా" చిత్రాన్ని తమిళంలో నిర్మించి, తెలుగు, హిందీ భాషల్లోకి అనువదిస్తారు. గతంలో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించిన "రోబో" (తమిళంలో "యందిరన్") చిత్రం రికార్డులు సృష్టించింది. రజనీ కాంత్ ఫస్ట్ లుక్ ఇలా ఉండబోతుందని ఈ "రాణా" చిత్రం పోస్టర్ ని ఇటీవల చెన్నైలో విడుదల చేశారు. మరి ఈ "రాణా" ఏం చేస్తుందో వేచి చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.