English | Telugu

రామ్ చరణ్ రచ్చ కథ ఇదేనా

రామ్ చరణ్ "రచ్చ" కథ ఇదేనని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే యువ హీరో మెగాస్టార్ ఏకైక కుమారుడూ, ఆయన నట వారసుడూ అయిన రామ్ చరణ్ తేజ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, " ఏమైంది ఈ వేళ " ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. "రచ్చ" మూవీ కోసమే రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో ఒక అంతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణపోంది మరీ కండలు పెంచి, ఎయిట్ ప్యాక్ తో తిరిగొస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే మంచి నీళ్ళలో ఫ్లోరైడ్ అధిక శాతం ఉండటం వల్ల, తెలంగాణా ప్రాంతాలైన నల్గొండ, మెహబూబ్ నగర్ జిల్లాలలో ప్రజలు ఎంతటి అనారోగ్యానికి గురవుతున్నారో, వారికి మంచి నీళ్ళు అందించటానికి హీరో చేసే రచ్చే ఈ "రచ్చ" చిత్రానికి కథని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. బహుశా ఇది నిజం కావచ్చు...కాకపోవచ్చు కూడా. ఏదేమైనా "రచ్చ"తో రామ్ చరణ్ త్వరలో రచ్చ రచ్చ చేయటానికి వస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.