English | Telugu

వర్మ ఏమిటి మాకీ ఖర్మ

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటాడు. అది మూవీస్ విషయంలో కావొచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కావొచ్చు. ఏదైనా సరే చేసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడి తన వైపు చూసుకునేలా చేయడం ఆర్జీవీ సిద్ధహస్తుడు. ఇక ఇటీవల ద్రౌపదీ ముర్ము గురుంచి అనవసర వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్నాడు. వాటిని వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఇంకో కామెంట్ ని ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగుతాడా అనుకుంటే ఇంకో అడుగు ముందుకేసాడు.

గౌరవనీయమైన ద్రౌపదీ గారు ప్రెసిడెంట్ ఐతే పాండవులు, కౌరవులు ఇద్దరూ కలిసి యుద్దాన్ని మర్చిపోయి ఆమెను ఆరాధిస్తారు. కొత్త భారతదేశంలో మహాభారతం తిరిగి కొత్తగా రాయబడుతుంది. ఇక అప్పుడు ఇండియాను చూసి ప్రపంచం గర్విస్తుంది. జై బీజేపీ అంటూ ట్వీట్ చేసాడు. మరో ట్వీట్ లో ఆమె ఫేస్ రీడింగ్ చూసి జోస్యం చెప్పారు ఆర్జీవీ. ఆమె ముఖ కవళికలు బట్టి ఆమె ప్రపంచం మొత్తంలోకి ఎప్పటికి గుర్తుండిపోయే గొప్ప రాష్ట్రపతి అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అందులో ఎలాంటి సందేహం లేదని అందుకు బీజేపీకి ధన్యవాదాలు చెప్తూ ట్వీటారు. వర్మ ఏమిటి మాకీ ఖర్మ అంటున్నారు నెటిజన్లు. ఈయన చేస్తున్న ట్వీట్లకు ఆదివాసీ సంఘాలన్నీ సీరియస్ అయ్యేసరికి ఆర్జీవీ యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.