English | Telugu

'సైజ్‌ జీరో' లో రెచ్చిపోయిన ప్రకాష్‌

మంచి పాత్ర పడితే ప్రకాష్‌ రాజ్‌ ఎలా చెలరేగిపోతాడో మనం ఎన్నో సినిమాల్లో చూశాం. గత కొంత కాలంగా ప్రకాష్‌ కి సరైన సినిమాలు కానీ పాత్రలు కానీ రావడం లేదు. దీంతో అతని క్యారెక్టర్లు ఎంతో బోర్ కొట్టించేస్తున్నాయి. అయితే చాలా రోజులు తరువాత మళ్ళీ ప్రకాష్ రాజ్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడట. 'సైజ్‌ జీరో' సినిమాలో శాడిస్ట్‌ విలన్‌ గా అభిమానులను అలరించాబోతున్నాడట. ముఖ్యంగా చెప్పాలంటే 'సైజ్‌ జీరో' లో ప్రకాష్ పాత్ర మెయిన్ హైలైట్‌ గా నిలవబోతు౦దట. ఈ సినిమాలో ప్రకాష్ మెడికల్ మాఫియా నడుపుతుంటాడట. ఈ పాత్ర చాలా టిపికల్‌ గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి 'సైజ్‌ జీరో'తో ప్రకాష్‌ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం!!

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.