English | Telugu

రాజ‌మౌళిపై ప్ర‌భాస్ సీరియ‌స్‌...??

బాహుబ‌లిపై రోజుకో రూమ‌ర్‌, పూట‌కో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మంచో , చెడో అది కూడా సినిమాకి కావ‌ల్సినంత ప్ర‌చారం చేసిపెడుతోంది. ఇప్పుడు మ‌రో హాట్ వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అదేంటంటే.. రాజ‌మౌళిపై ప్ర‌భాస్ చాలా కోపంగా ఉన్నాడ‌ట‌. అందుకు బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది.

బాహుబ‌లి పార్ట్ 1లో ప్ర‌భాస్ అప్పీరియ‌న్స్ గంట సేపు కూడా లేద‌ట‌. 2 గంట‌ల 35 నిమిషాల సినిమాలో ప్ర‌భాస్ క‌నిపించేది గంటే అంటే... అభిమానుల హృద‌యాలు త‌ల్ల‌డిల్ల‌క‌మాన‌వు. పైగా ఈ సినిమాలో ప్ర‌భాస్‌ది లేట్ ఎంట్రీ అని తెలుస్తోంది. సినిమా మొద‌లైన అర‌గంట వ‌రకూ ప్ర‌భాస్ క‌నిపించ‌డ‌ని చెప్పుకొంటున్నారు.

ఫ్లాష్ బ్యాక్‌, ఛైల్డ్ ఎపిసోడ్ల‌కే అర‌గంట కేటాయించార‌ట‌. ''మిర్చి త‌ర‌వాత నేను నా ఫ్యాన్స్ కి క‌నిపించి రెండేళ్లు దాటింది. `బాహుబ‌లి`పై వాళ్లు చాలా ఆశ‌లు పెట్టుకొన్నారు. వాళ్ల‌కు సంతృప్తిప‌ర‌చ‌క‌పోతే.. ఆ ప్ర‌భావం సినిమాపై ప‌డుతుంది'' అని రాజ‌మౌళికి సర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. అందుకే ఇప్పుడు పార్ట్ 2లోకి కీల‌క‌మైన ఎపిసోడ్‌ని పార్ట్ 1లోకి మార్చి.. ప్ర‌భాస్ పాత్ర నిడివి ఇంకాస్త‌పెంచాల‌ని రాజ‌మౌళి ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో బాహుబ‌లి స్ర్కీన్ ప్లే కాస్త మారుతుంది. ఆ ప్ర‌భావం సినిమాపై ఎంత ఉంటుంద‌నే విష‌యంపై రాజ‌మౌళి సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు వినికిడి. మొత్తానికి రాజ‌మౌళి ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అవుట్ పుట్ అటు ప్ర‌భాస్‌నీ, ఇటు ఆయ‌న‌ఫ్యాన్స్‌నీ సంతృప్తిప‌రిచేలా ఉండాలి క‌దా... మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.