English | Telugu

ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అఖండ-2 పరిస్థితి ఏంటి..?

జూన్ 12న 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకే మరో సినిమాతో అలరించనున్నారు. అదే 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

సెప్టెంబర్ 25 తేదీపై ఇప్పటికే 'అఖండ-2' కర్చీఫ్ వేసింది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దానికి తోడు అఖండ సీక్వెల్ కూడా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతికి వాయిదా పడే అవకాశముందని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావడం ఆసక్తికరంగా మారింది. మరి 'అఖండ-2', 'ఓజీ' మధ్య బాక్సాఫీస్ వార్ జరుగనుందా? లేక 'అఖండ-2' విడుదల తేదీ మారుతుందా? అనేది తెలియాల్సి ఉంది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే ఉంది. ఆరోజు 'అఖండ-2' టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు విడుదల తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.