English | Telugu

మాట‌ల మాంత్రికుడిని పట్టేసిన నితిన్

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్న దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. స్టార్ కథానాయకులు బిజీ అయిపోవడంతో త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దానిలో కూడా నిజం లేదని తేలిపోయింది.లేటెస్ట్ గా త్రివిక్రమ్ ఓ చిన్న హీరోతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ విషయం తెలుసుకున్న హీరో నితిన్..మాటల మంత్రికుడి వద్ద చాన్స్ కొట్టేయాలని డిసైడ్ అయ్యాడట. వెంటనే తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తన కోరికను వెళ్ళబుచ్చాడట. దీంతో ఆయన తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కు నితిన్ తో ఓ సినిమా చేయమని సూచించడట.

ప్రస్తుతం నితిన్ కూడా మంచి సక్సెస్ ట్రాక్ లో వుండడం, మనోడికి మాస్ లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ వుండడంతో త్రివిక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతో మాట‌ల మాంత్రికుడు నితిన్ కోసం ఓ కథ తయారు చేస్తున్నాడట. త్వరలో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళుతు౦దట. ఎలాగైతేనే౦ పెద్ద హీరోలకే దొరకని మాట‌ల మాంత్రికుడిని నితిన్ పట్టేసాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.