English | Telugu

'నేను.. శైలజ'' మూవీ ఫస్ట్ లుక్

'నేను.. శైలజ'' అనే పేరుతో టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ ను ఈ రోజే లాంచ్ చేశాడు రామ్. వానలో నడుచుకుంటూ వస్తున్న ఒక హీరో.. ఆమె గాళ్ ఫ్రెండ్.. అదే ఫస్ట్ లుక్ కహానీ. కాకపోతే ఈ మధ్యన ఫస్టు లుక్కులతో అందరూ కిరాకు పుట్టిస్తుంటే.. రామ్ మాత్రం చాలా సింపుల్ లుక్ తోనే వచ్చాడు. ఎందుకంటే ఈసారి మనోడు చాలా రియలిస్టిక్ కథతో వస్తున్నాడట. అందుకే ఈ పోస్టర్ ను కూడా చాలా సింపుల్ గా ప్లాన్ చేశాం అంటున్నాడు. ఏదేమైనా రామ్ హిట్టును చూసి చాలారోజులైంది. ఈ మధ్య అన్నీ ఫ్లాపులే. సో.. ''నేను.. శైలజ'' సినిమాతో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.