English | Telugu

నిర్మాతగా మారిన బాలయ్య.. మొదటి హీరో ఎవరు?

టాలీవుడ్ హీరోలు ఎందరో నిర్మాతలుగా మారుతున్నారు. నాగార్జున, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్, విష్ణు, నాని ఇలా ఎందరో హీరోలు సొంతంగా బ్యానర్స్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా చేరారు.

తన తల్లిదండ్రుల పేరు మీద తాజాగా 'బసవ తారకరామ క్రియేషన్స్' అనే బ్యానర్ ను ప్రారంభించారు బాలయ్య. గతంలో ఎన్బీకే ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ బయోపిక్ కి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నారు. ఈ బ్యానర్ పై ఆయన నిర్మించే మొదటి సినిమా ప్రకటన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం(మే 28న) రానుంది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నాడు. మరి 'బసవ తారకరామ క్రియేషన్స్' బ్యానర్ పై బాలయ్య నిర్మిస్తున్న మొదటి సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారో లేక మరెవరికైనా అవకాశం ఇస్తారో శనివారం తేలిపోనుంది. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబంలో ఇప్పటికే కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.