English | Telugu

ఆ ముగ్గురికీ క్లాస్ పీకిన మ‌హేష్ బాబు

మ‌హేష్‌బాబు నామ జ‌పం చేసిన 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి `1`తో దిమ్మ దిరిగితే... `ఆగ‌డు`తో బొమ్మ క‌నిపించింది. బ్యాక్ టూ బ్యాక్ ప్లాపుల వ‌ల్ల ఈ సంస్థ ప్ర‌తిష్ట మ‌స‌క‌బార‌బోతోంది. దూకుడు, వ‌న్‌, ఆగ‌డు....ఇలా మూడు సినిమాలు మ‌హేష్‌తో ఎగ్రిమెంట్ చేయించుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన 14 రీల్స్ సంస్థ‌.... ఇప్పుడు అదే మ‌హేష్ ముందు త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి తెచ్చుకొంది. ఆగ‌డు వైఫ‌ల్యంలో 75 శాతం వాటా... ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల తీసుకొంటే మిగిలిన‌దంతా నిర్మాత‌ల అశ్ర‌ర్థే. ఆగ‌డు పై ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్స్ తెచ్చుకొన్న మ‌హేష్‌... ఇప్పుడు నిర్మాత‌ల వైఖ‌రినీ త‌ప్పుబ‌డుతున్నాడు. ఓవ‌ర్ కాన్పిడెన్స్‌తో సినిమాని ముంచేశార‌ని, ప్ర‌మోష‌న్ల విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌ని, ముగ్గురు నిర్మాత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త విబేధాల‌తో సినిమాని నాశ‌నం చేశార‌ని, ఒక్క సారి సినిమాని మంచి రేట్ల‌కు అమ్ముకొన్న త‌ర‌వాత.... అస‌లు ప‌ట్టించుకోలేద‌ని ఇలా ర‌క‌ర‌కాల కంప్లైంట్లున్నాయి. దాంతో నిర్మాత‌లు ముగ్గురినీ ఇంటికి పిలిచి.. మ‌హేష్ భారీ క్లాసు పీకాడ‌ని స‌మాచార‌మ్‌.

మీడియాకి దూరంగా ఉండే మ‌హేష్ త‌న ప‌ద్ధ‌తి ఇది వ‌ర‌కే మార్చాడు. సినిమా విడుద‌ల‌కు ముందూ, ఆ త‌ర‌వాత మీడియాకి ఇంట‌ర్వ్యూలిచ్చేవాడు. 1 ఫ్లాప్ అయినా.. మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు మాత్రం ఆప‌లేదు. అయితే ఆగ‌డు సినిమా విడుద‌ల‌కు ముందు, ఆ త‌ర‌వాత మ‌హేష్ మీడియా ముందుకు రాలేదు. నిర్మాత‌ల‌పై అలిగిన మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డానికి నిరాక‌రించాడ‌ని ఇన్‌సైడ్ టాక్‌. అంతేకాదు.... శ్రీ‌నువైట్ల ఫోన్ చేసినా రెస్సాండ్ అవ్వ‌డం లేద‌ని.... ఆగ‌డు సినిమా ప్రభావం నుంచి మ‌హేష్ కూడా త్వ‌ర‌గా బ‌య‌ట‌పడాల‌ని చూస్తున్నాడ‌ని అత‌ని స‌న్నిహితులు సైతం చెబుతున్నారు. `వాట్ టూ డూ వాట్ నాట్ టుడూ..` అని పంచ్‌లు వేసిన మ‌హేష్ ఇప్పుడు అదే డైలాగ్‌ని ప‌ఠించుకొంటున్నాడ‌న్న‌మాట‌. ఇక మీద‌టైనా ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌ద‌నే విష‌యాల‌పై మ‌హేష్‌కి స్ప‌ష్ట‌త వ‌స్తే... అదే ప‌ది వేలు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.