English | Telugu

కుమారి 21 ఎఫ్ 'ఫస్ట్ డే' అదరగొట్టింది

సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ భారీ క్రేజ్ తో రిలీజై ఆ అంచనాలను అందుకోవడంలో సఫలమైంది. సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కేలేక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్ లలో విడుదలైన ‘కుమారి 21 ఎఫ్’ మొదటి రోజు రూ.4 కోట్ల పైనే షేర్ సాధించినట్టు ఇండస్ట్రీ టాక్. సినిమా బడ్జెట్ పారితోషకాలన్నీ కలిపినా కూడా రూ.10 కోట్ల లోపే అంటున్నారు. సో మొదటి వారంలోనే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రాబోతుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతున్న దానిపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొని వుంది. రాజు గారి గది తరువాత కుమారి కూడా చిన్న సినిమాల్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలవబోతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.