English | Telugu

ప్రభాస్ కి అంతర్జాతీయ పబ్లిసిటీ

బాహుబ‌లి సంబంధించిన క్రెడిట్ మాత్రం ప్ర‌భాస్ కి ద‌క్క‌లేదు. ఇది రాజ‌మౌళి సినిమా సినిమాగానో, రానా సినిమాగానో చ‌లామ‌ణీ అవుతోంది. ఇప్పటి వ‌ర‌కూ ప్ర‌భాస్‌ని అక్క‌డ ప‌ట్టించుకొన్న‌దే లేదు. బాహుబ‌లి టీమ్ కూడా బాహుబ‌లిని రానా సినిమాగానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. దీంతో కొంచెం ఫీలయిన ప్రభాస్ తెలివిగా ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపి ప్రముఖులను కలవడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. దీంతో ఒక్కసారిగా మనోడు అంతర్జాతీయ స్టార్ అయిపోయాడు. ఫోర్బ్స్ లోకి ఎక్కాడు.

మనోడి మీద ఓ రేంజిలో ప్రశంసలు కురిపించింది ఫోర్బ్స్. ప్రధాని మోదీ తన పనులన్నీ పక్కనబెట్టి మీట్ అయిన ట్వీట్ చేసిన హీరో ఇతనంటూ పరిచయం చేసి.. ప్రఖ్యాత హాలీవుడ్ హీరోలు హారిసన్ ఫోర్డ్ ఎలిజా వుడ్ లతో పోలిక పెట్టింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మారుమోగిపోతోందో ఫోర్బ్స్ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ కథనం చూసి మనోడి రేంజి ఏ స్థాయికి వెళ్లిపోయిందో అంటూ టాలీవుడ్ సెలబ్రెటీలంతా ట్విట్టర్లో సందడి చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.