English | Telugu

‘డైనమైట్’ సెన్సార్ రిపోర్ట్

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డైన‌మైట్' సినిమాని రూపొందించారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు,చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుని చేశారు.

విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్ర‌ణీత హీరోయిన్‌గా న‌టించింది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌యన్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. విజయన్ మాస్టర్ నేతృత్వంలో విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు అందించారు.

ఫెంటాస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచి కథ, మ్యూజిక్, యాక్షన్, మంచు విష్ణు హై వోల్టేజ్ ఫెర్ ఫార్మెన్స్ ఉన్న ఈ సినిమా తిరుగులేని సక్సెస్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.