English | Telugu

మెగా రెంజులో మెగాస్టార్ బర్త్ డే

మెగాస్టార్ చిరంజీవి ఈ పుట్టినరోజుతో 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళావేదిక అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఆగస్టు 21 మిడ్ నైట్ 12 గంటలకు చిరు కేక్ కట్ చేసి అభిమానుల సమక్షంలో పుట్టిన రోజును ఘనంగా చేసుకుంటున్నారు. ఈ వేడుకలో చరణ్ బన్ని , మెగా యువ హీరోలంతా పాల్గొంటారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. 21 రాత్రి అంగరంగ వైభవంగా విందు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కేక్ లు కోక్ లకు కొదువే ఉండదు. అలాగే 22వ తేది కొంతమంది ప్రముఖలకు స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. పార్క్ హాయత్ తో రాత్రి 8.30కి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి డ్రస్ కోడ్ కూడా నిర్ణయించారు చెర్రీ అండ్ టీం. ఫార్మల్ డ్రస్, బ్లాక్ టైతో ఈ ప్రోగ్రాంకి హాజరుకావాల్సి ఉంటుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.