English | Telugu

ఏం షాకిచ్చావ్ బాల‌య్యా..?!

బాల‌య్య‌... బాల‌య్య‌... బాల‌య్య‌.. అభిమానుల గుండెల్లో నిత్యం మ‌ర్మోగే మంత్ర‌మిది. బాల‌య్య‌ని తెర‌పై చూసుకొంటే చాలు.. కోటి దీపాలు వెలిగిన‌ట్టుంటాయ్ వాళ్ల‌కి. అలాంటి నంద‌మూరి ఫ్యాన్స్‌కి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. నంద‌మూరి బాల‌కృష్ణ త్వ‌ర‌లోనే సినిమాల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారు. 100వ సినిమానే బాల‌య్య ఆఖ‌రి సినిమా. ఈ విష‌యాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ అధికారికంగానూ ప్ర‌క‌టించారు.

వందో సినిమా త‌ర‌వాత తాను పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టిపెడ‌తాన‌ని చెబుతున్నారు బాల‌కృష్ణ‌. అంటే సినిమాల‌కు దూర‌మైన‌ట్టే క‌దా..?! డిక్టేట‌ర్ బాల‌య్య 99వ సినిమా. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌నుతో సెంచ‌రీ సినిమా పూర్తి చేస్తారు. 2016 నాటికి బాల‌య్య వందో సినిమా పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత పూర్తిగా ఆయ‌న పాలిటిక్స్ లోనే ఉండిపోనున్నారు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా త‌న న‌ట‌వార‌సుడు మోక్షజ్ఞ‌ని వెండి తెర‌పై చూసుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఇందుకోసం కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది.

మోక్ష‌జ్ఞ‌కు స‌రిప‌డా క‌థ సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే బాల‌య్య‌కు `మంత్రి` ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌న్న ప్ర‌చారం కూడా మ‌రోవైపు ఉదృతంగా న‌డుస్తోంది. మంత్రిగా ప‌ద‌వీ స్వీకారం చేశాక కూడా సినిమాలు, షూటింగులూ అంటూ ఆలోచిస్తే కుద‌ర‌దు. అందుకే బాల‌కృష్ణ ఈ నిర్ణ‌యం తీసుకొన్నార‌ని చెప్పుకొంటున్నారు. బాల‌కృష్ణ సినిమాల‌కు దూర‌మ‌వ్వాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం అభిమానుల‌కు నిజంగా షాకింగ్ న్యూసే. కానీ.. రాజ‌కీయాల‌తో ప్రత్య‌క్షంగా ప్ర‌జ‌ల‌కు ట‌చ్‌లో ఉంటారు కాబ‌ట్టి... కొంత‌లో కొంత స‌ర్దుక‌పోవ‌చ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.