English | Telugu

పారితోషికంతో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌భాస్‌



అంద‌రి నోటా.. బాహుబ‌లి మాటే. బాహుబ‌లి బ‌డ్జెట్ ఇంత‌, అంత అని లెక్క‌లు ఘ‌నంగా చెప్పుకొంటున్నారు. మ‌రి.. పారితోషికాల మాటేంటి? రాజ‌మౌళి ఎంత పారితోషికం తీసుకొన్నాడు? ప్ర‌భాస్ కి ఎంతిచ్చారు? అనే విష‌యాల్ని మాత్రం చిత్ర‌బృందం బ‌య‌ట‌కు చెప్ప‌డానికి నిరాక‌రిస్తోంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... ప్ర‌భాస్ పారితోషికం విష‌యం కాస్త లీక్ అయ్యింది.

ప్ర‌భాస్‌కి ఈసినిమా కోసం రూ.25 కోట్లు అప్ప‌గించార‌ట‌. అదీ.. రెండు ద‌ఫాలుగా. తొలుత ప్ర‌భాస్‌కి రూ.18 కోట్ల పారితోషికం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌. అయితే.. ఈ సినిమాకి రెండున్న‌రేళ్లు కేటాయించ‌డం వ‌ల్ల‌.. ఇంకో రూ.7 కోట్లు ఇవ్వాల‌ని నిర్మాత‌లు భావించి.. షూటింగ్ చివ‌రి రోజున ఆ మొత్తాన్ని ఒకేసారి ముట్ట‌జెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ `వ‌ద్దు.. వ‌ద్దు..` అన్నా నిర్మాత‌లు బ‌ల‌వంతంగా చేతిలో పెట్టార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప‌డిన క‌ష్టం అంత‌టిది మ‌రి. ప్ర‌భాస్‌కే రూ.25 కోట్లు ఇచ్చారంటే మ‌రి బాహుబ‌లి రూప‌శిల్పికి.. జ‌క్క‌న్న‌కు ఎంతివ్వాలో..??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.