English | Telugu

బాహుబ‌లి టాక్... బ‌య‌ట‌కు చెప్పొద్దు!

బాహుబ‌లి విష‌యంలో రాజ‌మౌళి ఎంత ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. ఇప్ప‌టి వ‌రకూ ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్ని ప‌ద్ధ‌తిగా తెలివిగా చేసుకొచ్చాడు రాజ‌మౌళి. సెన్సార్ విష‌యంలో అత‌ని తెగువ కూడా క‌నిపిస్తుంది.

పెద్ద సినిమాల‌కు సాధార‌ణంగా ఓ వారం ముందు, లేదంటే నాలుగు రోజుల ముందు సెన్సార్ చేయిస్తారు. కానీ బాహుబ‌లి విడుద‌ల‌కు 18 రోజుల ముందే సెన్సార్ అయిపోయింది. సినిమాకి సెన్సార్ అయితే.. ఏదోలా టాక్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. సినిమా అలా ఉంద‌ట‌, ఇలా ఉంద‌ట అంటూనే సినిమాకి సంబంధించిన కీల‌క అంశాలు లీక్ చేస్తుంటారు. మీడియాకీ, సెన్సార్‌కీ మ‌ధ్య ఉన్న లిరేష‌న్‌తో సినిమా టాక్ బ‌య‌ట‌కు వచ్చేస్తుంది.

అయితే... ఆ భ‌యం కూడా రాజ‌మౌళికి లేదు. ఎందుకంటే సెన్సార్ స‌భ్యుల‌కు ఈ సినిమా టాక్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ బ‌య‌ట‌కు లీక్ చేయొద్ద`ని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. సెన్సార్ స‌భ్యుల్నంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించి.. వాళ్ల ద‌గ్గ‌ర నుంచి మాట తీసుకొన్నాడ‌ని టాక్‌.'చాలా పెద్ద బ‌డ్జెట్‌తో తీసిన సినిమా ఇది. ఏ విష‌యంలో లీక్ చేసినా.. థ్రిల్ పోతుంది'' అంటూ అభ్య‌ర్థించాడ‌ట‌. దాంతో సెన్సార్ స‌భ్యులు కూడా.. ''ఏ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చూస్తాం'' అని మాటిచ్చిన‌ట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.