English | Telugu

ఏకంగా ఐశ్వర్యారాయ్ కే ముద్దు పెట్టేశాడు..!

ఐశ్వర్యారాయ్..40 ప్లస్‌లోనూ అదే ఛార్మింగ్, అదే యాక్టింగ్. మనదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఐష్ అందానికి..నటనకి ఫిదా అవుతుంది. ఒకసారి ఆమెను చూస్తే చాలు జన్మ ధన్యం అనే వీరాభిమానులున్నారు. అలాంటి ఐశ్వర్యకి ఎవరూ ఊహించని సంఘటన ఎదురైంది. ప్రజంట్ ఇండియా టూర్‌కి వచ్చిన బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ పాల్గొన్న ఒక కార్యక్రమానికి ఐశ్వర్యకు కూడా ఇన్విటేషన్ అందింది. దీంతో ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లిన ఐష్‌కు రెడ్ కార్పెట్‌పై గ్రాండ్‌గా వెలకమ్ చెప్పారు నిర్వాహకులు.

ఆమె రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళుతూ అందరిని విష్ చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఫోటో జర్నలిస్ట్‌ల్లో నిల్చుని ఉన్న బ్రిటిష్ జర్నలిస్ట్ ఐశ్వర్యకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. ఐష్ కూడా పలకరింపులో భాగంగా షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ టైంలో సడెన్ గా ఐశ్వర్య చేతిని జర్నలిస్ట్ ముద్దు పెట్టేసుకున్నాడు. అంతే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా స్టన్నయ్యారు. అయితే ఏ మాత్రం టెన్షన్ పడని ఐష్ సమయస్పూర్తితో వెంటనే ఒక చిరునవ్వు నవ్వేయడంతో వాతావరణం మామూలైపోయింది. అయితే సదరు జర్నలిస్ట్ ఐశ్వర్యకు ముందే తెలిసి ఉండవచ్చని అందుకే ఆమె కూడా సీరియస్ అవ్వలేదని అక్కడి వారు గుసగుసలాడుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.