Read more!

English | Telugu

సినిమా పేరు:యాగం
బ్యానర్:సిల్వర్ స్క్రీన్ మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 19, 2010
డానీ (నవదీప్) బ్యాంకాక్ లో బార్ టెండర్ గా పని చేస్తూంటాడు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తి. సోఫియా (కిమ్ శర్మ) నవదీప్ లవర్. ఇద్దరూ ఒకే బార్ లో పనిచేస్తుంటారు. బ్యాంకాక్ లో బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ ఆర్య (రాహుల్ దేవ్) మిస్టీరియస్ గా చనిపోయినట్టు డానీకి కల వస్తుంది. అలాగే థాయ్ లాండ్ మంత్రి ఒకతను కూడా చనిపోయినట్టు కలగంటాడు. అతను కన్న కలలు నిజరూపం దాలుస్తాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఓ బార్ లో పనిచేసే సంతోష్ (నవదీప్) నందిని (భూమిక)ని ప్రేమిస్తాడు. ఆమె హెయిర్ హోస్టెస్. అయితే బ్యాంకాక్ లో డానీ, సంతోష్ ఒకరేనా, డానీ కలలు నిజరూపం దాల్చడం వెనుక మిస్టరీ ఏమిటి... అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకుని సినిమా తీశాడు. అయితే కథని డీల్ చేయడంలో సక్సెస్ సాధించలేకపోయాడు. స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది. హీరో నవదీప్, భూమిక కాంబినేషన్ బావుంది. దర్శకుడు అరుణ్ ప్రసాద్ గతంలో తీసిన తమ్ముడు, గౌతమ్ ఎస్.ఎస్.సి. కథలకు పూర్తిగా భిన్నంగా కథని ఎంచుకుని డీల్ చేయడం విశేషం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :-నవదీప్ లుక్స్ పరంగా ఆకట్టుకుంటాడు. ఎక్స్ ప్రెషన్స్ లోనూ, డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ ఆకట్టుకుంటాడు.భూమిక :- హీరోయిన్ భూమిక చాలా చక్కగా ఉంది. నటనలో ఆమెకి ఏమాత్రం వంక పెట్టలేం. తన పాత్రకి తగ్గట్టుగా చేసింది.కిమ్ శర్మ :- కిమ్ శర్మ నటన కంటే అందాలు ఆరబోయడంలోనే ఎక్కువగా కష్టపడింది.అజయ్ :- ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అజయ్ నటన ఆకట్టుకుంటుంది.హర్షవర్ధన్ :- అజయ్ అసిస్టెంట్ పాత్రలో హర్షవర్ధన్ కనిపిస్తాడు. హాస్యం పండించడంలో హర్షవర్ధన్ సక్సెస్ సాధించారు.మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.టెక్నికల్ డిపార్ట్ మెంట్ :-సంగీతం :- మణిశర్మ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది. సాంగ్స్ కూడా థియేటర్ నుండి బయటికి రాగానే మర్చిపోయే విధంగా ఉన్నాయి.కెమేరా :- భరణి కె. ధరణి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతీ ఫ్రేమ్ ని చాలా చక్కగా చిత్రీకరించారు.మాటలు :- కథకి తగ్గట్టుగా ఉన్నాయి.దర్శకత్వం :- ఫర్వాలేదు.నవదీప్, భూమిక కాంబినేషన్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు.