Read more!

English | Telugu

సినిమా పేరు:వెంకటాద్రి
బ్యానర్:రామకృష్ణా సినీ స్టూడియోస్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 20, 2009
వెంకటాద్రినాయుడు (తారకరత్న) ఏడుగురుని చంపేసిన ఉరిశిక్ష పడిన ఖైది. అతని ఆఖరి కోరిక మేరకు జైలర్‌ (హరికృష్ణ) సంగీత కచేరీ నిర్వహిస్తాడు. జైలర్‌ ఫ్రెండు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి (శరత్‌)ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. అతని కూతురు శృతి (మందీప్‌ టక్కర్‌) కూడా ఆ సభకి వస్తుంది. వెంకటాద్రి సంగీత కచేరీ విని పరవశించిపోతుంది శృతి. ఆ కచేరీకి వచ్చిన ఫండ్స్‌ని ఓ అనాధాశ్రమానికి విరాళం ఇవ్వమంటాడు వెంకటాద్రి. అలాంటి మంచి మనసున్న వెంకటాద్రి ప్రేమలో పడడమే కాకుండా అతన్ని ఉరిశిక్ష బారినుండి కాపాడాలని రాష్ట్రపతికి క్షమాభిక్ష లేఖని కూడా పంపుతుంది. దాంతో వెంకటాద్రికి ఉరిశిక్ష రద్దవుతుంది. అయితే ముఖ్యమంత్రి కూతురు తనపై ప్రేమని వెలిబుచ్చినా ఆమె ప్రేమని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తాడు వెంకటాద్రినాయుడు. అతను ఆమె ప్రేమని తిరస్కరించడానికి కారణం ఏమిటి..? అతను ఏడుగురుని హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
తారకరత్న ఈ చిత్రంలో శక్తివంచనలేకుండా కృషి చేసాడు. నటనలోనూ, డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోను పరిపక్వత కనిపించింది. వి. సముద్ర దర్శకత్వం ఫర్వాలేదు. అక్క సెంటిమెంట్‌తో పాటు తారకరత్న ఫెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి ప్లస్‌పాయింట్‌ అని చెప్పాలి. ఫ్యాక్షన్‌ గొడవలు పక్కనబెడితే ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం సిస్టర్‌ సెంటిమెంట్‌ పండించే సీన్లే. ఈ చిత్రంలో దర్శకుడు శరత్‌ ముఖ్యమంత్రిగా నటించడం ఓ స్సెషల్‌ అయితే ఓ షాట్‌లో దర్శకుడు సముద్ర కనిపించడం ఓ విశేషం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- వెంకటాద్రినాయుడుగా తారకరత్న ఫెర్‌ఫార్మెన్స్‌ అందరినీ అలరిస్తుంది. తన అక్క సుఖం కోసం ఏదైనా చేయడానికి వెనుకాడని తమ్ముడిగా ఆయన నటన అందరినీ అలరిస్తుంది. అలాగే పరశురామనాయుడుగా నటించిన రంగనాథ్‌ నటన చాలా బాగుంది. హీరోయిన్‌ మందీప్‌ టక్కర్‌ నటన ఫర్వాలేదు. మిగతా వారంతా తమ తమ క్యారెక్టర్స్‌కి తగ్గట్టుగా నటించారు.