Read more!

English | Telugu

సినిమా పేరు:వీడొక్కడే
బ్యానర్:ఎ.వి.యమ్.ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:May 1, 2009
సింపుల్‍ కథ. ఒక స్మగ్లింగ్ గ్రూప్‌కీ, మరో స్మగ్లింగ్ గ్రూప్‌కీ మధ్య జరిగే వార్ ఈ చిత్రం కథ. దేవా (సూర్య) తనకు గాడ్ ఫాదర్ వంటి ప్రభుకి నమ్మిన బంటు. కస్టమ్స్ వాళ్ళ కన్నుగప్పి స్మగ్లింగ్ చేయటంలో దిట ఆఫ్రికా నుండి వజ్రాలు స్మగ్లింగ్ చేయటం వీరి ముఖ్యమైన పని. వీళ్ళకి వ్యతిరేకంగా. కమలేష్ (ఆకా దీప్) కూడా స్మగ్లింగ్ చేస్తుంటాడు. తన కోవర్టుగా దేవా గ్యాంగ్‌లో తన మనిషి చిట్టి(జగన్)ని ఉంచుతాడు. ఇదిలా ఉండగా ఒక రోజు చిట్టి తమ వ్యతిరేక వర్గమైన కమలేష్‌కి కోవర్టు అని దేవాకి తెలుస్తుంది. దాంతో దేవాకీ, కమలేష్‌కి మధ్య డైరేక్ట్ వార్ మొదలవుతుంది. దాంతో ఒకరిపై మరొకరు ఎత్తులు వేసుకుంటు ఒకరినొకరు నాశనం చేసుకోవాలనే ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమా మొదలైన పద్ధతి చూస్తే ఇదొక బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫంతా ఒక విధంగా సాగి సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి అనవసరమైన సాగతీత ప్రేక్షకుల సహనాన్ని కొంతవరకు పరీక్షిస్తుంది. దీనికి కారణం సూర్య వంటి ఒక స్టార్ ఇమేజ్‍ ఉన్న హీరోతో సమానంగా విలన్‌ని కూడా శక్తివంతంగా చూపించాలన్న ప్రయత్నం, కానీ ఆ ప్రయత్నంలో కమలేష్ పాత్రధారి ఆకాష్ దిప్ సైగల్‍ విఫలమయ్యాడనే చెప్పాలి. దర్శకుడు సెకండ్ హాఫ్ లో హీరోకి విలన్ దొరికినట్టే దొరకటం, మళ్ళీ తప్పించుకు పోవటం, అతన్ని పట్టుకోటానికి హీరో ఎత్తుల మీద ఎత్తులు వేయటం వల్ల సినిమా సాగతీసినట్లనిపించటం వల్ల చూసే ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదీ గాక ఈ చిత్రంలో తమిళ దర్శక, నిర్మాతల మీద ఒక భయంకరమైన సేటైర్ ఉంది. అదేంటంటే రకరకాల ఇంగ్లీష్ సినిమాల డివిడిలు చుసి కథలు తయారుచేసుకుంటారని. అయితే ఈ చిత్ర దర్శకుడు కుడా ఈ సినిమాలో అదే పనిచేయటం విశేషం. రెండు మూడు రకాల ఇంగ్లీష్ చిత్రాల సీన్లు, ఈ చిత్రంలో డైరెక్టుగానో లేక ఇన్‌డైరేక్టుగానో ఈ చిత్రంలో మనక్కడపడతాయి. ఉదాహరణకి బ్లడ్ డైమండ్‌, క్యాచ్‌మి ఇఫ్ యు కెన్అనే చిత్రాల్లోని కొన్ని సీన్లు యధాప్రకారం, కొన్ని సీన్లు దర్శకుడు తన స్టైల్లో కాపీ కొట్టటం ఈ చిత్రంలో మనకు కనపడుతుంది. అంటే ఎవరో మనమీద కామెంట్‍ చేసి సెటైర్ వేసే దాకా ఎందుకూ, మన మీద మనమే సెటైర్ వేసుకుంటే పోలా అన్నట్టుగా ఉంది ఈ దర్శకుడు పద్ధతి. అదీగాక ఈ చిత్రంలో రివర్స్ స్క్రీన్‌ప్లేని, (అంటే జరిగిన సీన్ ని వివరించటం కోసం దానికి అవసరమైన లింక్‌ని మళ్ళీ చూపించటం), అతిగా అవసరానికి మించి వాడటం కుడా మైనస్ పాయింట్‍.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇక నటన విషయానికొస్తే దక్షిణాదిన మనకున్న చాలా కొద్దిమంది మంచి నటుల్లో హీరో సూర్య ఒకరంటే అతిశయోక్తి కాదు. తన పాత్ర మీద అతనికున్న శ్రద్ధ, అంకితభావం ఈ చిత్రంలో అతని పాత్రపోషణలో మనకి అణువణువునా కనపడతాయి. అతనెలాంటి నటుడో అతని గత చిత్రాలు "గజని, సూర్య s/o కృష్ణన్'' వంటి చిత్రాలు చెపుతాయి. అలాగే ఈ చిత్రంలో కూడా తనను తాను విభిన్నంగా, ప్రత్యేకంగా చూపించుకునే ప్రయత్నం చేయటంలో సూర్య చాలా బాగా సఫలీకృతుడయ్యాడు. ఈ చిత్రంలో సూర్య రకరకాల హేయిర్ స్టైల్స్ తో ప్రేక్షకులకు తాను కొత్తగా కనపడేందుకు పడిన శ్రమ ముచ్చటేస్తుంది. ఇక తమన్నా ఈ చిత్రంలో చాలా అందంగా కనిపించి ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తుంది. అందుకు కారనం బహుశా సినిమాటోగ్రాఫర్ కారణమనవచ్చు ఈక విలన్ ఆకాష్ దిప్ ముఖంలో ఏ భావం పలకదు. బహుశా అతను అది కూడా ఓకరకమైన నటననుకొన్నాడో ఏమో గాని ప్రతిదానికీ ఓకే ఎక్స్ ప్రేషన్ ఇవ్వటం వల్ల సూర్య నటన ముందు అతను తేలిపోయాడు. దర్శకుడు విలన్‌ని హీరో అంత శక్తివంతుడిగా చూపించటనికి ప్రయత్నించి విఫలమయ్యాడని చెప్పాలి. ఇక మాఫి యా డాన్‌లా నటించిన ప్రభు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. చిట్టిగా నటించిన జగన్ కూడా బాగానే నటించాడు. అతని కామెడీ బాగానే పండింది.సంగీతం -: ఈ చిత్రంలోని సంగీతం బాగానే ఉంది. పాటల్లో కొంచెం తమిళ వాసన కొట్టినా, రీ-రికార్డింగ్ మాత్రం అదిరింది. హేరీస్ జైరాజ్‍కి ఈ చిత్రం ఆడియో పరంగా మరొక హిట్‍ చిత్రమని చెప్పవచ్చు.