Read more!

English | Telugu

సినిమా పేరు:తేజం
బ్యానర్:సన్ రైజ్ ఎంటర్ టైన్ మెంట్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 12, 2010
హైదరాబాద్‍లో ఉండే సౌమ్య డాక్టర్ చదువుతున్న విధ్యార్థి, ఆమెకి అమెరికాలో డాక్టర్ చదువుకునే సువర్ణావకాశం వస్తుంది. అయినా కూడా పల్లెటూర్లలో నుండి వైద్యంచేయటం కోసం సిటీకి వస్తున్న ఎంతోమంది పేదవారికి వైద్యంఅందటంలేదని తెలుసుకొని అమోరికా అవకాశాన్ని వదులుకుంటుంది. డాక్టర్ చదువు ఇక్కడే చదివి పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చదువుకుంటుంది. సౌమ్య ఉండే అపార్ట్ మెంట్ లోనే ఉంటున్న ఎనిమిదిమంది యువకులు సౌమ్యకి క్లోజ్‍ ఫ్రెండ్స్ వారు చేసే జాబ్‍లు వేరైనా కలిసే ఉంటుంటారు. ఇలా ఉండగా సౌమ్యని ప్రేమిస్తున్నానని ఓ ఆకతాయి సౌమ్య వెంట పడడం, సౌమ్య ఓప్పుకోకపోవడంతో సైకోగా మారిన అతను సౌమ్యని ఓ అపార్ట్ మెంట్ ఫై నుండి క్రిందికి తోసివేయడం జరుగుతుంది, తీవ్ర గాయాలపాలైన సౌమ్య బ్రతకాలంటే 70 లక్షల రూపాయలు అవసరం ఏర్పడుతుంది, ఆ 70 లక్షల రూపాయలను సౌమ్య స్నేహితులైన ఆ ఎనిమిదిమంది యువకులు ఎలా సంపాదించారు,, ?. ఆ డబ్బు సంపాదించడం కోసం వారు ఏవిధంగా ప్రయత్నించారు అనేది మిగతా కధ.
ఎనాలసిస్ :
ఈ చిత్రం ప్రారంభంలోనే దర్శకుడు తన స్నేహితులతో కలసి తీసిన చిత్రమని చెప్పారు. అంతేకాదు యాభై మంది కొత్తవారితో నిర్మితమవుతుందని కూడా చెప్పారు. సో... అంతా కొత్తవారు కావడంతో లాజిక్‍ని వెతకకుండా సినిమా చూడాలి, ఇక ఒక మంచికధని డీల్‍చేసేటప్పుడు స్క్రీన్‍ప్లేని ఏంతో పగడ్బందీగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మఖ్యంగా అందరూ కొత్త నటీనటులే ఉన్నప్పుడు దర్శకుడు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సివస్తుంది, మొత్తానికి ఈ చిత్రంలో కధ- కధనాల్లో లోపాలు స్పష్టంగా కనిపించినప్పటికీ ఒక చక్కని పాయింట్‍తో సినిమాని రూపొందించినందుకు దర్శకుడిని అభినందించాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: ఈ చిత్రంలో బ్రహ్మనందం, ఎమ్మెస్ నారాయణ మినహా అందరూ కొత్తవారే కావడంతో వారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీలేదు. ఎనిమిది మందిలో కొందరు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అందరిలోకి మనకి పరిచయం ఉన్న జెమిని సురేష్‍ నటన బాగుంది, సౌమ్య పాత్రలో నటించిన అమ్మాయి నటన బాగుంది. బ్రహ్మనందం, ఎమ్మెస్ నారాయణలు అలా కనిపించి ఆకట్టుకుంటారు, మేసేజ్‍ పరంగా సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్నా.. స్క్రీన్‍ప్లేలో ఉన్న కొన్ని లోపాలవల్ల ప్రేక్షకులని కట్టిపడేసేవిధంగా లేదని చెప్పవచ్చు. సంగీతం -: యావరేజ్‍గా ఉంది.పాటలు -: మూడు పాటలు బావున్నాయి.