Read more!

English | Telugu

సినిమా పేరు:టార్గెట్
బ్యానర్:సిరిసాయి సూర్య మూవీస్
Rating:---
విడుదలయిన తేది:May 22, 2009
మందాకిని (ముమైత్‌ఖాన్‌‍) ప్రసిద్ధ నవలా రచయిత్రి. ఎర్రగులాబీ అనే నవలతో ఆమె వెలుగులోకి వస్తుంది. ఒక బాక్సర్‌ని ఎవరో హత్యచేస్తారు.ఆ హత్య మందాకిని వ్రాసిన ఎర్రగులాబీ అనే నవలలో వ్రాసినట్టుగానే జరుగుతుంది. మర్మకళ బాగా తెలిసిన వారు ఆ మర్మకళనుపయోగించి ఆ హత్య చేసినట్లుగా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో కూడా వెల్లడవుతుంది. మరుగున పడిపోయిన మర్మకళ తెలిసిన వారే తక్కువ. అలాంటి మర్మకళ ద్వారా ఒక నవలలో వ్రాసిన విధంగా హత్యచేయటం గురించి పోలిస్ డిపార్ట్ మెంట్‍ సీరియస్‌గా తీసుకుని, బోస్ (శివబాలాజీ) అనే పోలీసాఫీసర్ని ఈ హత్యకేసుని పరిష్కరించవలసిందిగా ఆదేశిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో పోలీసుల అనుమానం మందాకిని మీదకు మళ్ళుతుంది. కానీ ఆమె ఈ హత్య చేసిందనటానికిఆధారాలు దొరకవు. చివరికి లైడిటెక్టర్ వంటి పరీక్షలో కూడా ఆమే నిర్దోషిగా తేలుతుంది. అయినా బోస్‌కి మందాకిని మీద అనుమానంగానే ఉంటుంది. ఇంతకీ అసలు ఈ మందాకిని ఎవరు..? మందాకిని ఆ హత్య నిజంగా చేసిందా.?.. లేదా..? చేస్తే ఎందుకు చేసింది..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
ఇలాంటి పగ, ప్రతీకారాల కథలతో అనేక చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. ఈ చిత్రానికి "బేసిక్ ఇన్‌స్టీంక్ట్‌" అనే ఆంగ్ల చిత్రం మాతృకగా అనిపిస్తుంది. కాకపోతే మన నేటివిటీకి మార్చటానికి గట్టి విఫల ప్రయత్నమే చేశారు... కానీ అది విఫలమైంది. ఈ చిత్రం సాంకేతికంగా చాలా పూర్ స్టాండర్డ్ లో ఉందని చెప్పాలి .స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. అలాగే స్క్రిన్‌ప్లే కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేని విధంగానే ఉంది. ఇక టేకింగ్ పరంగా చూస్తే సగటు స్థాయిలోనే ఉంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: ఉన్నంతలో ముమైత్‌ఖాన్‌ మాత్రమే ఈ చిత్రంలో నటించిన వారిలో బేటర్. హీరో శివబాలాజీ ఒక పోలీసాఫీసర్‌లో ఉండాల్సిన చురుకుదనం, కరుకుదనం చూపించటంలో విఫలమయ్యాడనే చెప్పాలి. అతనిలో చురుకుదనం లేకపోతే లేకపోయింది. నీరసం పాలెక్కువగా కనిపించిందీ చిత్రంలో. ఇక శ్రద్ధా దాస్ పాత్రకు నటించటానికి పెద్దగా అవకాశం లేదు. కృష్ణభగవాన్, కొండవలస లక్ష్మణరావు, వేణుమాధవ్‍ల,జీవా,విజయరంగరాజుల కామెడీ ప్రేక్స్హకులను నవ్వించటంలో విఫలమయ్యిందనే చెప్పాలి. సంగీతం -: గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు. రీ-రికార్డింగ్ బాగుంది. మాటలు -: పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవు. ఎడిటింగ్ -: ఈ చిత్రంలో ఈ డిపార్ట్ మెంట్‍ మాత్రం బాగా పనిచేసిందని చెప్పాలి. ఎడిటింగ్ నీట్‍గా ఉంది. యాక్షన్ -: ఫరవాలేదు. ఇలాంటి చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి.అయినా చూస్తామంటే మీ ఇష్టం.