Read more!

English | Telugu

సినిమా పేరు:తాజ్ మహల్
బ్యానర్:శివాజీ ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 20, 2010
అజయ్ (శివాజి) వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అజయ్ తల్లిదండ్రులు (కోట, సంగీత) ఓ పల్లెటూరిలో నిరుపేద జీవనం సాగిస్తుంటారు. అజయ్ ఇంజనీరింగ్ చదువుకోసం ఉన్న ఆస్తినంతా అమ్మేస్తారు. అయితే అజయ్ మాత్రం చదువుని గాలికి వదిలేసి అదే కాలేజీలో ఛదువుకుంటున్న శృతి (శృతి)ని మూడేళ్ళుగా ప్రేమిస్తుంటాడు. ఆమెతో పరిచయం పెంచుకోవడం కోసం అజయ్ ప్రయత్నం చేస్తాడు. అయితే శృతి కుమార్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కుమార్ శృతి ఫోన్ ఫ్రెండ్. కేవలం ఫోనులో మాట్లాడటం తప్పించి అతన్ని చూడదు. శృతి కుమార్ ని ప్రేమిస్తుందని తెలిసినా అజయ్ ఆమె వెంట పడతాడు. శృతిపై పీకల్లోతు ప్రేమలో పడ్డ అజయ్ జీవితం చివరికి ఎలా ముగిసిందన్నది మిగితా కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రాన్ని హీరో శివాజీ తానే స్వయంగా నిర్మాతగా మారి నిర్మించాడన్నది తెలిసిందే. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావడంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చిత్రం చూస్తుంటే తెలుస్తుంది. హీరో, నిర్మాత అయిన శివాజీ చిత్ర నిర్మాణంలోనూ, తన నటనలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన మునపటి చిత్రాలకన్నా ఈ చిత్రంలో ఎంతో అందంగా కనిపించాడు. చిత్రం ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్ హార్ట్ టచ్చింగ్ సెంటిమెంట్ సీన్లతో సీరియస్ గా సాగుతుంది. ఓవరాల్ గా చూసే ప్రేక్షకుడు సినిమాలో లీనమయిపోయే విధంగా దర్శకుడు సినిమా తీయగలిగాడు. ఇక ఫస్టాఫ్ లో 'మాయదారి మైసమ్మో... మైసమ్మా' సాంగ్ లో ఆర్తి అగర్వాల్ అలా మెరిసి మురిపిస్తుంది. నేటి యువత ప్రేమ పేరుతొ తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజెప్పే ఈ చిత్ర కథని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :-హీరో శివాజీ తన పాత్రలో లీనమయిపోయి నటించాడు. లవ్ సీన్లలోనూ, సెంటిమెంట్ సీన్లలోనూ చాలా చక్కని నటన కనబరిచాడు. ముఖ్యంగా సెకెండాఫ్ చివరి అరగంట సినిమాలో శివాజీ నటన చాలా బావుంది. శృతి :- హీరోయిన్ గా ఈ చిత్రం మొదటిదే అయినప్పటికీ శృతి చాలా చక్కని నటనని కనబరిచింది. ఓవర్ యాక్షన్ లేకుండా తన పాత్రకి తగ్గట్టుగా బాగా చేసింది.రఘుబాబు :- శంకరన్న పాత్రలో రఘుబాబు పాత్ర ఆకట్టుకుంటుంది. కామెడీ విలన్ గా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే రఘుబాబు ఈ చిత్రంలో కొన్ని సీన్లలో కంట తడి పెట్టించే విధంగా నటించాడు. సెంటిమెంటు సేన్లలో కూడా తాను ఇట్టే నటించేయగలనని నిరూపించాడు.బ్రహ్మానందం :- బ్రహ్మానందం కనిపించింది కొన్ని సీన్లలోనే అయినా చక్కని హాస్యాన్ని పండించాడు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందంల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.నాజర్ :- హీరోయిన్ తండ్రి పాత్రలో నాజర్ నటన బావుంది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు.కోట శ్రీనివాసరావు :- హీరో తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పల్లెటూరి పేద రైతుగా ఆయన కాస్ట్యూమ్స్ చాలా సహజంగా ఉన్నాయి.వేణుమాధవ్ :- సీనియర్ కాలేజీ స్టూడెంట్ గా వేణుమాధవ్ నవ్వించాడు.మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. కెమేరా :- కెమేరా పనితనం బావుంది. పాటల చిత్రీకరణలో కెమేరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ :- ఎడిటింగ్ ఫర్వాలేదు. పాటలు :- మూడు పాటలు ఆకట్టుకుంటాయి. "మాయదారి మైసమ్మో' సాంగ్ వస్తున్నంత సేపూ థియేటర్ లో ఈలలు, చప్పట్లు. మాటలు :- బావున్నాయి. హీరో తన ఫ్రెండ్ తో గిన్నిస్ బుక్ గురించి మాట్లాడితే 'అదేమీ ఎక్కాల బుక్కు కాదు' అని అంతే 'అది ఎక్కాల బుక్కు కాదు, అందరూ ఎక్కాలనుకునే బుక్కు' లాంటి డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. దర్శకత్వం :- అరుణ్ సింగరాజు దర్శకత్వం బావుంది. ఇది అతనికి మొదటి చిత్రమే అయినా చాలా బ్యాలెన్స్ డ్ గా చిత్రాన్ని తెరకెక్కించాడు. శివాజీ నటనని, ఓ మంచి ప్రేమ కథా చిత్రాన్ని చూడాలనుకుంటే ఈ చిత్రాన్ని చూడండి.