Read more!

English | Telugu

సినిమా పేరు:శ్రీశైలం
బ్యానర్:ఇమేజ్ ఫిలింస్
Rating:2.25
విడుదలయిన తేది:Jan 31, 2009
ఇదొక దేశభక్తి చిత్రం. మిలటరీలో పనిచేసే మేజర్‌ శ్రీశైల మల్లికార్జున్‌ (శ్రీహరి) తన స్నేహితుడు విశ్వనాథ్‌ (నాగబాబు) భార్యాబిడ్డలు లుంచినీ పార్కులో చావటానికి కారణమైన ఒక టెర్రరిస్టుని అప్పగించటం ఇష్టం లేక, తనని ఆత్మత్యాగం చేసుకోవటం చూసి, ఆ టెర్రరిస్టుల మూలం హైదరాబాద్‌లో ఉందని తెలుసుకుని, వాళ్ళని అంతం చేయటానికి, తానూ ఒక టెర్రరిస్ట్‌గా మారి అక్కడ ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో డ్రైవర్‌గా చేరతాడు. ఆ కాలేజీ వైస్‌ఛాన్స్‌లర్‌ మేజర్‌ కె.వి. కృష్ణదేవరాయ (కృష్ణంరాజు) ఇండియా, పాకిస్తాన్‌ దేశాల మధ్య శాంతి చర్చలకు ఈ టెర్రరిజం అడ్డంకిగా ఉందని తెలిసి, దాన్ని నివారించేందుకు ఒక ముసాయిదాని తయారుచేస్తాడు. అదే జరిగితే పాకిస్తాన్‌ టెర్రరిజం అంతమైపోతుందని, అందుకని అతన్ని చంపటానికి అశ్వాక్‌ఖాన్‌ (యశ్‌పాల్‌శర్మ) అనే టెర్రరిస్ట్‌ నాయకుడు, శ్రీశైలంని నిజంగానే టెర్రరిస్ట్‌ అనుకుని అతని ద్వారా ప్రయత్నింస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా శ్రీశైలం, కృష్ణదేవరాయ అల్లుడిని చంపుతాడు. శ్రీశైలం చివరికి కృష్ణదేవరాయని కూడా చంపే ప్రయత్నం చేస్తాడు. శ్రీశైలం టెర్రరిజాన్ని అంతం చేశాడా..? లేదా..? అన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
మాస్‌ దర్శకుడిగా ముద్రపడిన కె.యస్‌.నాగేశ్వరరావు ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం నిర్వహించారు. అందుకనే దీన్ని దేశభక్తితో దేశభక్తితో కూడిన పక్కా మాస్‌ చిత్రంగా మలచారు. కాకపోతే నాలుగు బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా హీరో ఓ 20 మందితో లెక్కలేకుండా ఫైట్‌ చేయటమన్నది తెలుగు సినిమాకున్న ప్రాథమిక లక్షణం. దానికి ఈ సినిమా మినహాయింపు కాదు. ఇక కాలేజీ ఎపిసోడ్స్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రక్షల ఎపిసోడ్‌, నూతన నటుడు రామ్‌కిరణ్‌ కోసం కిక్‌ బాక్సింగ్‌ ఏర్పాటు చేయటం వంటివి సినిమా స్పీడ్‌ని తగ్గించినట్లనిపించాయి. ఇక నటన విషయానికొస్తే శ్రీమరి ఎనర్జీ అందరికీ తెలిసిందే. ఫైట్స్‌లో మామూలుగానే అదరగొట్టాడు. నటన పరంగా కూడా శంకర్‌దాదాగా, మాస్‌లా నడవటం వంటి వాటితో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. వేణుమాధవ్‌, చిత్రం శీను, బ్రహ్మానందం, శ్రీహరిల కామెడీ సీన్స్‌ బాగానే పండింది. నాగబాబు చనిపోయిన సీన్టో నాగబాబు, శ్రీహరిల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కృష్ణంరాజు తన పాత్రకు న్యాయం చేశారు. కొత్త కుర్రాడు రామ్‌కిరణ్‌ మంచి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి వున్నాడని ఫైట్స్‌లో, డ్యాన్సుల్లో అతని మూమెంట్స్‌ చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే అతను నటనే ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నూతన నటి నజిత, సుహానీ, రక్ష తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం :- ఈ చిత్రంలోని పాటల్లో నచ్చావే, కనులు కనులు అనే రెండు పాటలు మాత్రం బాగున్నాయి. రీ – రికార్డింగ్ ఫరవాలేదు. మాటలు :- ఫరవాలేదు.కానీ ;ఉచ్చ’అనే మాట పదే పదే వాడటమే కొంచెం ఇబ్బందిగా ఉంది. సినిమాటోగ్రఫి ;- బాగుంది. ఎడిటింగ్ :- బాగుంది. కొరియోగ్రఫీ :- మొదటి పాటలో బాగుంది. యాక్షన్ :- శ్రీహరి సినిమా అంటేనే ప్రక్షకులు మంచి యాక్షన్ సీన్స్ ఆశించి వస్తారు. కనుక ఈ చిత్రంలో యాక్షన్ పుష్కలంగా ఉంది. ఇద్దరు ఫైట్ మాస్టర్లు తమ శక్తి కొద్దీ యాక్షన్ ని గుప్పించారీ చిత్రంలో.