Read more!

English | Telugu

సినిమా పేరు:స్నేహ గీతం
బ్యానర్:లార్స్ కో ఎంటర్ టైన్ మెంట్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 16, 2010
ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం మొదలవుతుంది.కృష్ణ,రవి,అర్జున్,శైలు,పూజ,మహా అనబడే మహాలక్ష్మి ల కథే ఈ చిత్రం.వీళ్ళంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.కృష్ణ కి జీవితంలో పెద్ద ఆశలుండవు.తను ప్రేమించే పూజతో పెళ్ళి,ఓ త్రీ బెడ్ రూమ్ ,ఫ్లాట్,సంవత్సరానికి 5లక్షలు సంపాదించే ఉద్యోగం ఇవీ అతని గోల్.శైలూని ప్రేమించే తల్లీదండ్రీ లేని రవికి జీవితంలో ఏదైనా సాధించాలనీ,మంచి బిజినెస్ మేన్ గా ఎదగాలనీ కోరిక.అర్జున్ కి సినీ దర్శకుడు కావాలనేది జీవితాశయం.కానీ అతని తండ్రి అతన్ని అమెరికా వెళ్ళి చదువుకో అని పోరు పెడుతూంటాడు.ఇతను,మహాలక్ష్మి ప్రేమించుకుంటారు.వీళ్ళంతా జీవితంలో తమ తమ లక్ష్యాలను ఎలా సాధించారన్నది మిగిలిన కథ.వీరికి తోడు,ఎయిడ్స్ పాపారావు,బాక్సాఫీస్ భూషణం,పితామహ ల ఉపకథలు ఈ చిత్రంలో ఉంటాయి.
ఎనాలసిస్ :
ఇది డైలీ సీరియల్ కి కాస్త ఎక్కువ...సినిమాకి బాగా తక్కువ.కొత్త దర్శకుడి అమెచ్యూరిటీ,అనుభవరాహిత్యం ఈ సినిమాలో అడుగడునా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.ఈ సినిమాలో వేణు మాధవ్ ఎపిసోడ్,వెన్నెల కిశోర్ ఎపిసోడ్,కృష్ణుడు ఎపిసోడ్,హీరోల ముగ్గురి ఎపిసోడ్లూ,హీరోయిన్ల ఎపిసోడ్లూ ఇలా దేనికదే విడివిడిగా మనక్కనపడతాయే గానీ,ఓవరాల్ గా ఇదోక సినిమా అన్న ఫీలింగ్‍ కలగకపోవటానికి ప్రథాన కారణం ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే.షాట్ టెకింగ్ మీద ఉన్న శ్రద్ధ సీన్ కీ సీన్ కీ ముందు లింక్ ఇవ్వటంలో కానీ,లీడ్ ఇవ్వటంలో కానీ మరింత శ్రద్ధ చూపించి ఉంటే సినిమా బాగా వచ్చి ఉండేది.అదీగాక ప్రతి సీన్ ని పండించటంలో కూడా మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది.సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ సరదాగా గడిచినా,సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా ప్రేక్షకుడి సహనం పరీక్షిస్తుంది.నిర్మాణపు విలువలు బాగున్నాయి. నటన - అందరూ తమ తమ పాత్రలకు వారి వారి స్థాయిల్లో న్యాయం చేశారు.ఇంతకంటే చెప్పటం అనవసరం. సంగీతం - ఇది మాత్రం ఈ చిత్రంలో చెప్పుకోతగిన స్థాయిలో ఉంది.సునీల్ కాశ్యప్ అనే ఈ చిత్ర సంగీత దర్శకుడు బాగా కృషి చేస్తే భవిష్యత్ లో మరో ఎ.ఆర్.రెహమాన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.పాటల్లో ముఖ్యంగా పల్లెటూరిలో పాట ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.కొత్తగా వినపడుతుంది.సరిగమపదనీ అనే పాట,బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట చాలా బాగున్నాయి.అలాగని మిగిలిన పాటలు బాగోలేదని కాదు.వీటి స్థాయిలో లేవని అభిప్రాయం.రీ-రికార్డింగ్ కొండొకచో బాగుంది.ఒక్కోచోట సగటు స్థాయిలో ఉంది. కెమెరా - పి.జి.విందా సినిమాటోగ్రఫీ ఇండోర్ లో కన్నా అవుట్ డోర్ లోనే బాగుంది.ఫేర్ వెల్ పార్టీ పాటలో లైటింగ్ చాలా పుర్ గా ఉంది.అదే పల్లెటూరి పాటలో చాలా బాగుంది.మొత్తానికి కెమెరా వర్క్ ఫరవాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ - చెప్పుకోతగినంత గొప్పగా ఏం లేదు. ఆర్ట్ - ఒ.కె. కొరియోగ్రఫీ - పల్లెటూరి పాటలో బాగుంది.మిగిలిన పాటల్లో ఫరవాలేదు. యాక్షన్ - ఈ చిత్రంలో దీనికి అంత ప్రాథాన్యత లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ కథ చెప్పటానికి బాగుంటుందేమో కానీ,ఆ రేంజ్ లో చూపించటంలో దర్శకుడు విఫలం కావటంతో కాస్త విసుగనిపిస్తుంది. చూడాలనుకుంటే...మీ ఇష్టం...చూస్తే చూడండి.