Read more!

English | Telugu

సినిమా పేరు:సింహా
బ్యానర్:యునైటెడ్ మూవీస్
Rating:3.50
విడుదలయిన తేది:Apr 30, 2010
శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) కాలేజీ ప్రొఫెసర్. అతనంటే ఆ కాలేజీలో అందరికీ గౌరవం. తన కాలేజీ స్టూడెంట్స్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆ కాలేజీలోకి జానకి (స్నేహ ఉల్లాల్) కొత్తగా జాయిన్ అవుతుంది శ్రీమన్నారాయణ ప్రేమలో పడుతుంది జానకిని వెతుక్కుంటూ కొందరు రౌడీలు ఆ కాలేజీకి వస్తారు ఆ రౌడీల బారినుండి శ్రీమన్నారాయణ జానకిని కాపాడుతాడు. ఆ వచ్చిన రౌడీలు వీరకేశవుడు (ఆదిత్య మీనన్) కొడుకు పంపించాడని తెలుసుకుంటాడు. అంతేకాదు వీరకేశవుడు తన తండ్రి నరసింహ (బాలకృష్ణ)ని హతమార్చాడని తెలుసుకుంటాడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే వీరకేశవుడు అతని కొడుకులు బొబ్బిలి ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకుంటారు. తమకి అడ్డువచ్చిన వారిని నిర్థాక్షిణ్యంగా చంపేస్తుంటారు. ఆ సమయంలో లండన్ లో డాక్టర్ చదువుకున్న బొబ్బిలి వంశస్దుడైన నరసింహ (బాలకృష్ణ) అక్కడికి వస్తాడు తన స్వంత ఊరులో హాస్పిటల్ పెట్టి పేదవారికి ఉచిత వైద్యాన్ని అందిస్తుంటాడు. వీరకేశవుడు పెంచి పోషించిన రౌడీలను అడ్డంగా నరికేస్తుంటాడు. చివరికి తమ పనులకి అడ్డుపడుతున్న నరసింహాన్ని వీరకేశవుడు కుట్రపన్ని చంపేస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న శ్రీమన్నారాయణ ఆ తర్వాతేం చేశాడు...? అసలు జానకి ఎవరు...? అన్నవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఈ నాలుగు విభాగాలు తన భుజాన వేసుకున్న శ్రీను ప్రతి దానికీ సరైన న్యాయం చేసాడు ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించి, సెకెండాఫ్ ఫుల్ యాక్షన్ ని జోడించిన విధానం బావుంది. ఇక చాలా రోజుల తర్వాత బాలయ్య బాబుకి ఈ చిత్రం చక్కని విజయాన్ని అందించింది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే నరసింహ క్యారెక్టర్ ఈ చిత్రానికే హైలైట్ ఆ పాత్రలో బాలకృష్ణ ఒదిగి పోయాడు నరసింహని చంపే సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్ ట్రార్డనరీగా ఉంటుంది ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. సమరసింహారెడ్డి,. నరసింహనాయుడు తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :-బాలకృష్ణ నటనే ఈ చిత్రానికి హైలైట్ తండ్రీకోడుకులుగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. బాలయ్య అభిమానులకి ఇక చెప్పాల్సిన పనిలేదు. నయనతార సంప్రదాయబద్ధంగా కనిపించి మెప్పించింది. ఇక నమిత, స్నేహా ఉల్లాల్ లు కూడా తమ పాత్రల పరిథిమేరకు బాగానే చేశారు హాస్యాన్ని పండించడంలో కృష్ణభగవాన్, వేణుమాధవ్, బ్రహ్మానందంలు సకేస్ అయ్యారు మిగతా నటీనటులు తమ క్యారెక్టర్లకి తగ్గట్టుగా బాగానే చేశారు.ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ బోయపాటి శ్రీను అందించిన డైలాగ్స్. అందులో కొన్ని... ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ స్టూడెంట్ లో బాలయ్యని ఊహించి ఉద్దేశించి అనే డైలాగ్ ''తప్పు చేస్తూ వందసార్లు ఎదురుపడు, కానీ తప్పుచేయాలన్న ఆలోచనతో ఆయనకి ఒక్కసారి ఎదురుపడ్డావనుకో ఇక అంతే...'', ఓ సందర్భంలో వేణుమాధవ్ నమితని ఉద్దేశించి ''కరెంటు పోయిందని వెళ్లి ట్రాన్స్ ఫారాన్ని వాటేసుకున్నావు గదే...'', ఇక బాలయ్య పలికే డైలాగ్ లు... ''నేను మాట్లాడితే నీ చెవులు మాత్రమె పని చేయాలి... వేరే ఏదీ పనిచేయకూడదు...'' ''చూడు... ఒకవైపు చూడు... రెండో వైపు చూడాలనుకుంటే ఖతమైపోతావ్...'' లాంటి డైలాగ్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. చక్రి సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్... ''సింహా... సింహ...,.. బంగారు కొండ పాటలు బావున్నాయి...ఇక ఈ చిత్రంలో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... ప్రతీ ఫైట్ ని చాలా చక్కగా కంపోజ్ చేసారు. ఓవరాల్ గా బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కి బోయపాటి శ్రీను టేకింగ్ కి ఈ సినిమా ఓ చక్కని మాస్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిందని చెప్పొచ్చు. బాలకృష్ణ అభిమానులకి ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు... ఇక బాలయ్య ఎక్స్ ట్రార్డనరీ ఫేర్ ఫార్మేన్స్ చూడాలనుకుంటే ఈ చిత్రాన్ని తప్పక చూడండి. ఈ సినిమాతో సమ్మర్ కి డబుల్ డమాకా లభించినట్లయింది. ఇప్పటికే డార్లింగ్ సినిమాకి వచ్చిన హిట్ టాక్ తో పాటు సింహా కూడా ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించనున్నది. బాలకృష్ణ అభిమానులలో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. సంవత్సరాల తరబడి నిరీక్షించిన బాలయ్యకు సింహతో మంచి హిట్ లభించినట్లయింది.