English | Telugu
సినిమా పేరు:సారాయి వీర్రాజు
బ్యానర్:విశాలాక్షి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ .
Rating:2.00
విడుదలయిన తేది:Dec 4, 2009
బ్యానర్:విశాలాక్షి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ .
Rating:2.00
విడుదలయిన తేది:Dec 4, 2009
నర్సీపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సారాయి వీర్రాజు (అజయ్), ధనలక్ష్మి (రమ్య నంబీశన్) చిన్ననాటి స్నేహితులు. ధనార్జన కోసం వీరు సారా వ్యాపారం వృత్తిగా చేపడతారు. వీర్రాజు ఆ గ్రామంలో ఆకతాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు తారసపడతారు. ఆ ముగ్గురితో చేతులు కలుపుతాడు వీర్రాజు. కొంతకాలం సజావుగా సాగిపోతుంది. ఇంతలో వీర్రాజు స్నేహితులు నకిలీ పథకం తమ జీవితాలను మారుస్తుందని గుడ్డిగా నమ్మిన గ్రామస్తులు ఆ పథకంలో చేరతారు. కొద్దికాలం తర్వాత బోర్డ్ తిప్పేస్తారు ఆ ముగ్గురూ. దీనితో తమ కలలు కల్లలైనాయని భావించి, తట్టుకోలేని కొందరు గ్రామస్తులు ఆత్మహత్యకు పాల్పడతారు. ఇది చూసి ధనలక్ష్మి పోలీసుల సహాయంతో మోసగాళ్ళ వద్దకు వెడుతుంది. అక్కడ మోసాగాళ్ళతో చేతులు కలిపిన పోలీసు అధికారి ధనలక్ష్మిపై సామూహిక అత్యాచారానికి పాల్పడతాడు. అత్యాచారానికి గురైన ధనలక్ష్మి మరణిస్తుంది. ధనలక్ష్మి మృతికి, గ్రామస్తుల ఆత్మహత్యలకు కారకులైన వారి ఆచూకీ కోసం వీర్రాజు ప్రయత్నించగా, వారు దుబాయ్‌లో ఉన్నారని తెలుస్తుంది. వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దుబాయ్ పయనమవుతాడు వీర్రాజు. ఈ ప్రయాణంలో ప్రీతి (మధులిక) అనే యువతి పరిచయమవుతుంది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ప్రీతి ప్రేమ పెళ్ళిదాక వెళ్ళిందా లేదా? దుబాయ్ వెళ్ళిన వీర్రాజు ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ.