Read more!

English | Telugu

సినిమా పేరు:రాంబాబు గాడి పెళ్ళాం
బ్యానర్:సితార ఆర్ట్ క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Feb 26, 2010
క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇదొక ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. ఒక కుటుంబంలో జన్మించిన ఆడ శిశువుకు ఆమె పుట్టగానే మేనరికం ఖరారు చేసి, ఆమె పేరు కూడా ఆ మేనరికానికి తగినట్టు రాంబాబు గాడి పెళ్ళాం అని పెడతాడు. అక్కడ సన్నివేశాన్ని కట్ చేసుకుంటే.. రాంబాబు అతని భార్య పెరిగి పెద్దవుతారు. రాంబాబు శ్రీరామచంద్రుడిని పోలిన బుద్దిమంతుడు. ఏకపత్నీవ్రతుడు. బ్యాంకు ఉద్యోగి అయిన అతడిని ఒక యువతి ప్రేమించి, తనను ప్రేమింప చేసుకుంటుంది. మరో పక్క రాంబాబు గాడి పెళ్ళాం... ఎంతకూ తనను బావ పెళ్ళాడక పోవడంతో పుట్టింటి నుండి వచ్చి అతడి ఇంట్లోనే తిష్ట వేస్తుంది. ఇక ఇక్కడ నుండీ ఈ ఇద్దరు యువతుల మధ్య నలిగిపోయిన రాంబాబు చివరికి ఏమయ్యాడు అనేదే ఈ చిత్రకథ.
ఎనాలసిస్ :
అల్లరి నరేష్, గజాల "తొట్టిగ్యాంగ్" తర్వాత జంటగా నటించిన సినిమా ఇది. 2004లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై ఇన్నాళ్ళకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు కాపుగంటి రాజేంద్ర మోహన్ బాబు నటించిన "పెదరాయుడు" చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేశాడు. ఈ చిత్ర ప్రధమార్థమంతా అశ్లీల సంభాషణలతోనూ, సింగిల్ మీనింగ్ డైలాగుల(ఈ డైలాగులలో మరో అర్థానికి తావుండదని గమనించగలరు ) తోనూ నిండి కుటుంబ సభ్యులతో సినిమా చూసే వారిని ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్ ఆ ఇబ్బందిని తొలగించే రీతిలో సవ్యంగా సాగిపోతుంది. యువతను దృష్టిలో పెట్టుకుని ప్రధమార్థాన్ని ఆ విధంగా చిత్రీకరించి ఉండవచ్చని సరిపెట్టుకోవచ్చు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అల్లరి నరేష్ నాటన ఈ సినిమాలో మరింత మెరుగుపడింది. అయితే కామెడీ హీరో అని అతనికి ఉన్న ఇమేజ్ ని ఈ సినిమా కొద్దిగా మారుస్తుంది. మిగిలిన ప్రధాన తారాగణంలో పేరు మోసిన్ హాస్యనటులైన వేణుమాధవ్,ఎల్. బి. శ్రీరాం, ఎం. ఎస్ . నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వారి వారి పాత్రల పరిధుల మేరకు చక్కగా నటించారు. హీరోయన్ గా గజాలా,సోనాలీ జోషి తదితరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమీ లేదు.