Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రస్థానం
బ్యానర్:వి.ఆర్.సి.మీడియా
Rating:3.00
విడుదలయిన తేది:Apr 16, 2010
లోకనాథం (సాయికుమార్) బెజవాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బలమైన నాయకుడు. మిత్ర (శర్వానంద్) లోకనాథం పెంపుడు కొడుకు. తండ్రి అడుగుజాడల్లో అతనూ యూత్ లీడర్ గా ఎదుగుతాడు. అయితే లోకనాథం సొంత కొడుకు చిన్నా (సందీప్)కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉన్నా లోకనాథం మిత్రాకే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో మిత్రా పై పగపెంచుకుంటాడు చిన్నా. తాగుడుకు, డ్రగ్స్ కి బానిసయిన చిన్నా లోకనాథం అనుచరుడయిన బాషా కూతురుని రేప్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
దర్శకుడు దేవాకట్టా గతంలో వెన్నెల చిత్రాన్ని సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తంగా తెరకెక్కించి, తన రెండవ చిత్రాన్ని మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగిపోయే ఫ్యామిలీ డ్రామాని ఎంచుకోవడం అభినందనీయం. ఒక నిజాన్ని దాచాలంటే మనిషికి ఎంతో ధైర్యం కావాలి. ఆ నిజం వెలుగు చూస్తే తన మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్ధితిలో ఆ నిజాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చడానికి మనిషి క్రూరమృగమే అవుతాడన్న సత్యాన్ని లోకనాథం పాత్రద్వారా చూపించాడు దర్శకుడు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు చక్కని ప్రతిభని కనబరిచినా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బావుందనిపిస్తుంది. ప్రస్ధానం టైటిల్ కి తగ్గట్టుగానే కథ నడిపించిన విధానం బావుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- శర్వానంద్ నటన హైలైట్ గా నిలుస్తుంది. యూత్ లీడర్ గా అతని యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. సెంటిమెంట్ సీన్లలో అతను పలికించిన హావభావాలు బావున్నాయి. తన పాత్రకి తగ్గట్టుగానే చాలా బాగా నటించాడు. ఇక తాగుడుకు, డ్రగ్స్ కి బానిసయిన యువకుడు చిన్నా పాత్రలో సందీప్ ఒదిగిపోయాడు. చక్కని ఎక్స్ ప్రెషన్స్ తో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇందులో మరో కీలకమైన పాత్ర సాయికుమార్ ది. రాజకీయనాయకుడిగా సాయికుమార్ నటన చాలా బావుంది. ఇక బంగారు నాయుడు పాత్రలో జయప్రకాష్ రెడ్డి పాత్ర నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగానే బాగా చేశారు.ఈ చిత్రంలో సాంగ్స్ కి ఎక్కువగా స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్న సాంగ్స్ ని చాలా బాగా తెరకెక్కించారు. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా రీరికార్డింగ్ బావుంది.కెమెరా:- కెమెరా మెన్ శ్యామ్ దత్ చక్కని పనితనంతో ప్రతీ సీన్ ని ఎంతో నీట్ గా తెరకెక్కించాడు.దర్శకత్వం:- దేవకట్టా సినిమాని నడిపించిన విధానం బావుంది. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ సాధించారు.యూత్ ఓరియంటెడ్ చిత్రం కాకపోయినా యూత్ కి నచ్చే చిత్రం ఇది.