Read more!

English | Telugu

సినిమా పేరు:పిస్తా
బ్యానర్:జి.కె. ఫిలిం కార్పోరేషన్
Rating:---
విడుదలయిన తేది:May 29, 2009
కథ విషయానికొస్తే ఇదేం కొత్త కథ కాదు. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి. రామచంద్రాపురం అనే ఊరులో రఫ్ అండ్ టఫ్ గా ఉండే యువకుడు మురళీ కృష్ణ (విశాల్‍). తన తల్లి సంతోషం కోసం, చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన తన అన్నను వెతుక్కుంటూ రామచంద్రాపురం నుండి విశాఖపట్టణం వస్తాడు మురళీ కృష్ణ.ఈ ప్రయత్నంలో, విశాఖపట్టణంలో మురళీ కృష్ణ ఇద్దరు శక్తివంతులైన గూండాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళల్లో ఒకరు గురు (కిశోర్) కాగా, మరొకరు సూర్య ప్రకాష్ (ప్రకాష్ రాజ్‍). విశాఖపట్టణంలోకి దిగి దిగగానే మురళీ కృష్ణ ఒక హత్యను చుస్తాడు. ఆ హత్య గురు చేస్తాడు. పోలీసులకు తాను హత్య చేసిన వ్యక్తిని చూస్తే గుర్తు పడతానని చెపుతాడు మురళీకృష్ణ. హత్యచేసిన వ్యక్తిని గుర్తుపడితే చంపుతానంటాడు గురు. గుర్తుపట్టకపోతే తాను చంపుతానంటాడు సూర్యప్రకాష్. నిజానికి వాళ్ళని గూండాలనే కంటే గ్యాంగ్‌స్టర్లంటే బాగుంటుంది. వీళ్ళతో అనవసరమైన గొడవలు, అనివార్యంగా గొడవలు పడుతూ, తన అన్న కోసం వెతుకుతూ ఉంటాడు మురళీ కృష్ణ. ఈ మధ్యలో ఇందు (శ్రియ) తో మురళీకృష్ణ ప్రేమలో పడతాడు. చివరికి మురళీకృష్ణ తన అన్నను కలుసుకొన్నాడా...? తన తల్లి కోరిక తీర్చాడా...? తనకేదురవుతున్న గ్యాంగ్ స్టర్లను అతనేలా ఎదుర్కొన్నాడు...? అసలు పిస్తా అనిపించుకునే పని అతనేం చేశాడు అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ముందు చెప్పినట్లుగా ఇదేం కొత్త కథ కాకపోయినా, కథనంలో కూడా కొత్తదనం లేకపోవటం విశేషం.ఇక ఈ చిత్రం మొదటి సగమంతా ఏదో కాలక్షేపం బఠానీలా, క్యాజువల్‍ టైమ్ పాస్‌లా సాగిపోతుంది. అసలు కథ నిజానికి ఇంటర్వెల్‍ బ్యాంగ్ నుంచి మొదలవుతుంది. అది కూడా తర్వాత ఏం జరుగుతుందనేది చూసే ప్రేక్షకులకు ముందే తెలిసిపోవటం ఈ చిత్రానికి పెద్ద మైనస్. అది పూర్తిగా దర్శకుడి బాధ్యత. వాట్‍ నెక్స్ట్ట్ట్‍ట్‍ అనేది ప్రేక్షకులకు తెలిసిపోతే ఇక సినిమా వాళ్ళనెంత వరకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క నిర్మాణపు విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ఖర్చుకి వెనుకాడకుండా ఈ సినిమా తీశారనటానికి ఈ చిత్రం చూసిన పిల్లాడు కూడా ఆ విషయం చెపుతాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: ఇక రగ్గడ్ యువకుడిగా విశాల్‍ నటన మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అతని ఎనర్జీ లెవల్స్ కూడా చాలా బాగున్నాయి.ముఖ్యంగా యాక్షన్ సీన్లలో అది మరింతగా మనక్కనపడుతుంది. కానీ అతను తను హీరోగా నటించే చిత్రాల కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే మరింత బాగుంటుంది. మరిన్ని హిట్‍ చిత్రాలనతడు అందించగలడు.ఇక ఇందూ పాత్రలో శ్రియకు నటించేందుకున్న అవకాశం బహు తక్కువ. కానీ అవకాశం ఉన్నంతలో ఆమె తన అందాలను ప్రేక్షకుల కనువిందుగా స్క్రీన్ మీద బాగానే పరిచింది. ఆలీ కామెడీ బాగానే పండింది, కృష్ణభగవాన్ కామేడీకి ప్రేక్షకులు పెద్దగా నవ్విన దాఖలాలు లేవు. ఇక తనికెళ్ళ భరణికి సరిపోయే పాత్ర ఈ చిత్రంలో లేకపోయినా ఆయన ఆ పాత్రలో నటించటం పెద్దగా శోభించలేదు. గ్యాంగ్‍స్టర్లుగా ప్రకాష్ రాజ్‍, కిశోర్ ల నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సంగీతం -: మణిశర్మ సంగీతం పాటల విషయంలో సగటు స్థాయిలోనే ఉంది. రీ-రికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ -: బాగుంది. యాక్షన్‌ -: బాగా పాతకాలపు ఫైటింగ్ స్టైల్‍నే ఈ చిత్రంలో వాడారు. బహుశా హీరోది రామచంద్రాపురం అవటం వల్ల కావచ్చు ఈ చిత్రానికి అవుట్‍ డేటెడ్ యాక్షన్ నే అనుసరించారు. ఈ చిత్రం అవుట్‍ అండ్ అవుట్‍ పక్కా మాస్ చిత్రం. బి,సి సెంటర్లలో ఈ చిత్రం బాగా ఆడొచ్చు. మాస్ చిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు.