Read more!

English | Telugu

సినిమా పేరు:పిండం
బ్యానర్:కళాహి మీడియా
Rating:2.25
విడుదలయిన తేది:Dec 15, 2023

సినిమా పేరు : పిండం
నటీనటులు: శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు తదితరులు
 రచన,దర్శకత్వం: సాయికిరణ్ దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
సంగీతం : కృష్ణ సౌరబ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫి: సతీష్ మనోహర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
బ్యానర్: కళాహి మీడియా
విడుదల తేదీ :  డిసెంబర్ 15 

హర్రర్ ఎలిమెంట్స్ తో ఒక సినిమా చిత్రీకరణ జరుపుకుంటుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. పైగా ఒక వెరైటీ టైటిల్ తో ఆ సినిమా వస్తుందంటే అందులో నటించే ఆర్టిస్టులతో సంబంధం లేకుండా ఆ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉత్సాహంతో ప్రేక్షకులు ఉంటారు.అలాంటి ఒక మూవీనే  ఈ రోజు విడుదల అయిన పిండం. మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
ఆంథోనీ (శ్రీరామ్ ) శుక్లాపేట అనే ఒక విలేజ్ లో ఉన్న  రైస్ మిల్ లో గుమస్తాగా పని చేస్తు అదే ఊరిలో ఉన్న ఒక పాత బంగ్లా ని కొనుగోలు చేసి ప్రెగ్నెన్సీ తో ఉన్న భార్య మేరీ (ఖుషి రవి )  సోపి, తార అనే ఇద్దరు కూతుళ్లు  తల్లి సూరమ్మల తో సహా  ఆ బంగాల్లోకి దిగుతాడు.  సూరమ్మ తన కోడలు మేరీ కడుపున ఈ సారైనా చనిపోయిన తన భర్త పుడతాడనే నమ్మకంతో ఉంటుంది. ఈ లోపు  ఆ ఇంట్లో ఉన్న కొన్ని ప్రేతాత్మలు ఆంథోనీ చిన్న కూతురులోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత గర్భిణిగా ఉన్నఆంథోనీ భార్య ఆసుపత్రిలో చేరడంతో పాటుగా తల్లి సూరమ్మ చనిపోతుంది. ఆ తర్వాత ఆంథోనీ కి సాయం చెయ్యడానికి క్షుద్ర శక్తులని, ప్రేతాత్మలని ఎదిరించే తాంత్రిక విద్యలో నైపుణ్యరాలు అయిన అన్నమ్మ( ఈశ్వరి రావు ) వస్తుంది. తన టీం తో కలిసి ఆంథోనీ కుటుంబానికి పట్టిన సమస్యని అన్నమ్మ ఎలా పోగొట్టింది? అసలు ఆంథోనీ కుటుంబానికే ఈ సమస్య ఎందుకొచ్చింది ? అసలు అంతకు ముందు ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళ కథ ఏంటి ? అనేదే ఈ చిత్ర కథ.


ఎనాలసిస్ :

లో బడ్జట్ లో  సస్పెన్స్ హర్రర్ తో మిళితమైన పిండం  సినిమాని చూస్తున్నంత సేపు కూడా మేకర్స్ కొత్త వాళ్ళైనా కూడా మంచి ప్రయత్నం చేసారని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపిస్తు ఉంటుంది. కానీ సినిమా ప్రారంభం అయిన దగ్గర్నుంచి సినిమాలోని ప్రతి ఒక్క క్యారక్టర్ కూడా  జీవితంలో ఏదో కోల్పోయిన వారిలా ఎందుకు ఉంటారో తెలియదు. ఒక మనిషి  సరదాగా తన లైఫ్ కి కొనసాగిస్తున్నప్పుడు హఠాత్తుగా అతని జీవితంలోకి సమస్యలు వస్తే అప్పుడు మనిషి బాధలో ఉంటాడు.కానీ ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా బాధలు పడటానికే పుట్టామనే విధంగా ప్రవర్తిస్తు ఉంటుంది. కథ ప్రకారంగా ఆలోచిస్తే ఈ సినిమా లైన్ మంచి కథే. పైగా 1990 లో జరిగే కథ కాబట్టి సినిమాలో ఉన్న కొన్ని కొన్ని లోపాలని కూడా ప్రేక్షకుడు సర్దిచెప్పుకోవచ్చు.కానీ మరీ దారుణంగా సీన్ బై సీన్ వచ్చే సన్నివేశాల్లో  డే అండ్ నైట్ ఎఫెక్ట్ కూడా కంటిన్యూ గా వస్తాయి.అసలు సినిమాలోని  చాలా కేరక్టర్స్  కూడా  ఆర్ఆర్ కి భయపడి వెనక్కి తిరగడం ఏంటో  దర్శకుడుకి రచయితకే తెలియాలి. 

నటి నటుల పని తీరు
శ్రీరామ్ అండ్ ఖుషి రవి లు వాళ్ల పరిధి మేరకు బాగానే నటించారు.వాళ్ల పరిధి కూడా ఎలా ఉందంటే  బాధపడుతు ఒక డైలాగ్ చెప్పడం, కూతుళ్ళ గురించి తలుచుకుంటు బాధపడటం, ఆకలి అయితే భోజనం చెయ్యడం తప్ప వాళ్ళు అంతకు మించి చేసింది లేదు. కూతుళ్ళగా చేసిన వాళ్ళు సూపర్ గా చేసారు. మరి ముఖ్యంగా క్షుద్ర శక్తీ ఆవహించిన పాప అయితే చాలా చక్కగా చేసింది. ఇక ఈశ్వరి రావు ఐతే తన క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసింది. సినిమా చివరిదాకా ప్రేక్షకుడు థియేటర్ లో ఉండటానికి కూడా ఆమె పండించిన పెర్ ఫార్మెన్సు కారణం.అలాగే కనపడింది కొన్ని సీన్స్ లోనే అయినా కూడా అవసరాల శ్రీనివాస్ ఓవర్ డోస్ లేకుండా నటించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఒక మాదిరిగా కాపాడింది. కెమెరా పని తనం బాగున్న పిండం యొక్క దర్శకత్వ ప్రతిభ అంతంత మాతమ్రే.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

హర్రర్ సినిమా అంటే అర్ధం కథలో హర్రర్ ఉండాలి అంతే గాని హర్రర్ కోసమే కథ ఉండకూడదు. అలాగే మేము ఇప్పుడు భయపడాలి అనుకునే విధంగా హర్రర్ సినిమాలోని ఏ క్యారక్టర్ కూడా ముందుగా అనుకునే విధంగా వాళ్ల బాడీ లాంగ్వేజ్ అసలు ఉండకూడదు. అలాగే ఒక మనిషి గొప్పవాడు అవ్వడానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఒక సినిమా విజయం సాధించడానికి స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ పిండానికి సరైన స్క్రీన్ ప్లే లేకపోవడమే పెద్ద మైనస్ 

 

 - అరుణాచలం