Read more!

English | Telugu

సినిమా పేరు:పిల్ల జామిందర్
బ్యానర్:శ్రీ శైలంద్ర సినిమాస్
Rating:2.75
విడుదలయిన తేది:Oct 14, 2011

కథ - కోటీశ్వరుడికి మనవడై, డబ్బు విలువ, మనుషుల విలువ, మానవత్వం విలువ తెలియకుండా, పిల్లజమిందార్ లా అహంభావిలా తిరిగే పి.జె.ప్రవీణ్ జయరామరాజు (నాని) కి మేజరయ్యే నాటికి అతని తాతయ్య వ్రాసిన వీలునామా అతనికి డబ్బు విలువ, మనుషుల విలువ, మానవత్వం విలువలు తెలిపి, జీవితం అంటే ఏంటో ఎలా తెలిపిందనేది ఈ చిత్రం కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - అశోక్ గతంలో "ఆకాశరామన్న" చిత్రం చేసినప్పుడు దర్శకుడిగా అతని అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనపడింది. కానీ ఈ చిత్రంలో అదెక్కడా కనపడలేదు సరికదా, చక్కని అనుభవజ్ఞుడైన దర్శకుడిలా ఈ చిత్రాన్ని మలచిన తీరు బాగుంది. ఈ చిత్రం కథ, కథనం కొత్తగా ఉండి, ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టని స్క్రీన్ ప్లేతో, చక్కని టేకింగ్ తో ప్రేక్షకులను దర్శకుడిగా అశోక్ ఆకట్టుకుంటాడు....నిర్మాణపు విలువలు బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటన - నటుడిగా నాని ఎలాంటి వాడో ఈ రోజు కొత్తగా చెప్పక్కరలేదు. పాత్రలో దమ్ముంటే నానిలోని నటుడు రెచ్చిపోతాడని అతని గత చిత్రాలే నిరూపించాయి. నిజానికిప్పటి వరకూ అతని క్యాలిబర్ కి తగ్గ పాత్ర అతనికి లభించలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో పిల్ల జమిందారుగా అహంకారంతో మెలిగే పాత్ర, చదువు కోసం సిరిపురం వెళ్ళాక మానవత్వంతో, ప్రయోజకుడైన ఒక మంచి మనిషిగా అంచలంచెలుగా ఎలా మారుతుందనేది నాని నటనలో చక్కగా చూపించాడు. అందుకతన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఒక విధంగా నాని ఈ సినిమాని తన భుజాల మీదే మోశాడని చెప్పాలి. సింధు పాత్రలో నటించిన అమ్మాయి, బిందు మాధవి కూడా ఫరవాలేదనిపిస్తారు. ఇక రాజన్నగా రావు రమేష్ రావు, మేధావి ఐన పేద విద్యార్థిగా అవసరాల శ్రీనివాస్, ఉద్దండంగా యమ్.యస్.నారాయణ, డాక్టర్ శివప్రసాద్ ల తర్వాత జాతీయం అని పిలువబడే ధనరాజ్ పాత్ర మనల్ని ఆకట్టుకుంటుంది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. 

సంగీతం - సెల్వరాజ్ సంగీతం బాగుంది. మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రీ-రికార్డింగ్ కూడా సందర్భోచితంగా ఉండి బాగుంది.
కెమెరా - ఈ సినిమాలో కళ్ళకు శ్రమ కలిగించకుండా సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉండి బాగుంది.
మాటలు - "గెలుపు నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు. ఆ ఓటమి లోకాన్ని నీకు పరిచయం చేస్తుంది" వంటి అర్థవంతమైన మాటలు ఈ చిత్రానికి బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రంలోని మాటలు బాగున్నాయి.
పాటలు - పాటల్లోని సాహిత్యం కూడా వినసొంపుగా ఉండి అర్థవంతంగా ఉంది.
ఎడిటింగ్ - బాగుంది.
కొరియోగ్రఫీ - ఫరవాలేదు...గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు.
యాక్షన్ - సింపుల్ గా ఉండి బాగుంది.


వినోదాత్మకంగా ఉంటూ, ఒక చక్కని సందేశాన్నిస్తూ, అశ్లీలత, అసభ్యత లేకుండా, మానవత్వపు విలువలను ప్రతిబింబించేలా తీసిన ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.