Read more!

English | Telugu

సినిమా పేరు:పెళ్ళిచూపులు
బ్యానర్:ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌
Rating:3.00
విడుదలయిన తేది:Jul 29, 2016

 

షార్ట్ ఫిలిమ్స్ తో తమ ప్రతిబాను చాటుకొని మన నిర్మాతలను మెప్పించి.. సినిమాకి దర్శకత్వం వహించే దర్శకుల జాబితా ఇప్పుడిప్పుడే తెలుగులో పెరుగుతూ వస్తోంది. మొన్నామధ్య సుజిత్ అనే యువ ప్రతిభాశాలి కూడా "రన్ రాజా" అనే షార్ట్ ఫిలిమ్ తీసి ఆ తర్వాత శర్వానంద్ తో "రన్ రాజా రన్" అనే ఫీచర్ ఫిలిమ్ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకోవడంతోపాటు తదుపరి చిత్రంగా ఏకంగా "బాహుబలి" ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు అదే బాటలో మరో ప్రతిభాశాలి తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇదివరకు "అనుకోకుండా, సైన్మా" అనే డిఫరెంట్ షార్ట్ ఫిలిమ్స్ తీసిన తరుణ్ భాస్కర్ "పెళ్లిచూపులు" అనే న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తరుణ్ షార్ట్ ఫిలిమ్ ఎక్స్ పీరియన్స్ 70 ఎం.ఎం స్క్రీన్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలదో చూద్దాం..!!

కథ: జీవితంలో ఒక ఆశయం అంటూ లేకుండా తనకున్న ఇద్దరు ఫ్రెండ్స్ తో సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఆస్ట్రేలియా వెళ్లడానికి కావాల్సిన డబ్బును సొంతంగా ఏదైనా వ్యాపారం చేసి సంపాదించి.. తనకంటూ మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తన కలనూ నెరవేర్చుకోవాలని ఆరాటపడే ఆధునిక యువతి చిత్ర (రీతూ వర్మ). ఈ ఇద్దరు ఓ #పెళ్ళిచూపుల సందర్భంలో కలుసుకొంటారు. ఒక గంటసేపు ఇద్దరి గురించి చెప్పుకొన్నాక అసలు #పెళ్ళిచూపులు ఈ ఇద్దరికీ కాదని తప్పుడు అడ్రెస్ కారణంగా వేరే ఇంటికి వచ్చామని తెలుసుకొంటారు. #పెళ్ళిచూపులు కుదరకపోయినా.. ఇద్దరి మధ్య మంచి బిజినెస్ డీల్ మాత్రం కుదురుతుంది. ఒక ఫుడ్ ట్రక్ తో మొదలైన వీరి పరిచయం అనంతరం ప్రేమకు దారితీస్తుంది.
ఆ తర్వాత వారి జీవితాలు ఏ తీరానికి చేరాయి? వారి వారి జీవితాల్లో వాళ్ళు గెలుపొందారా? లేదా? అనేది #పెళ్ళిచూపులు చిత్ర కథాంశం.


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు: ప్రశాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ, చిత్ర పాత్రలో రీతూ వర్మలు నటించారని ఎక్కడా అనిపించదు, బిహేవ్ చేశారంతే. కాకపోతే విజయ్ క్యారెక్టర్ "కలుసుకోవాలని" చిత్రంలోని ఉదయ్ కిరణ్ క్యారెక్టర్ ను తలపించగా, రీతూవర్మ పాత్ర "గోదావరి" చిత్రంలోని కమలినీ ముఖర్జీని గుర్తుకు తెస్తుంది.తెలంగాణా స్లాంగ్ లో ప్రశాంత్ కడుపుబ్బ నవ్వించాడు. స్పెషల్ రోల్ లో నందు మెప్పించాడు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా అలరించారు. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ ల పరంగా "పెళ్ళిచూపులు" చిత్రం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎవ్వరూ అతి చేయరు, సన్నివేశానికి అవసరమైన మేరకు తెరపై తమ తమ పాత్రల్లో జీవించారంతే. సినిమాకి అదే పెద్ద ఎస్సట్. అనవసరమైన హంగులు, ఆర్భాటాలు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు "పెళ్ళిచూపులు" చిత్రం చక్కని అనుభూతిని మిగల్చడంలో నటీనటుల పనితీరు కీలకపాత్ర పోషిస్తుంది.

సాంకేతికవర్గం: ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించి చెప్పుకోవాలి. అతడు సమకూర్చిన బాణీలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ప్రతి ఒక్కపాట వయోబేధం లేకుండా అందరూ "హమ్" చేసుకొనేలా ఉండడం విశేషం. ముఖ్యంగా రెట్రో మిక్స్ మరియు ఫ్యూజన్ మిక్స్ బ్రాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిస్ ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే పాటకు తగ్గట్టుగా కాకుండా సిట్యుయేషన్ కి తగ్గట్లుగా వాయిస్ ను సెలక్ట్ చేసుకోవడం వివేక్ సాగర్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్ తో సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ కు మంచి భవిష్యత్ ఉంది.

అలాగే నగేష్ సినిమాటోగ్రఫీ కూడా. పరిమిత బడ్జెట్ లో గ్రే టింట్ లో డిఫరెంట్ లైట్ యూజ్ చేసి ప్రతి సన్నివేశానికి జీవం పోసాడు. సన్నివేశంలోని ప్రతి ఎమోషన్ ను తన లైట్ ఎఫెక్ట్ ద్వారా ఆడియన్స్ మైండ్ లో రిజిష్టర్ చేయడానికి తన శక్తిమేరకు కృషి చేశాడు. లైవ్ సౌండ్ ఎఫెక్ట్ తెలుగు ఆడియన్స్ కు కొత్త కాకపోయినప్పటికీ.. సహజమైన చిత్రం కావడంతో కాస్త హెల్ప్ అయ్యింది.

దర్శకుడికి టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంటే సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి "పెళ్ళిచూపులు" మంచి ఎగ్జాంపుల్. తాను తీసిన షార్ట్ ఫిలిమ్స్ తోనే ఆడియన్స్ ను అబ్బురపరిచిన దర్శకుడు తరుణ్ భాస్కర్ "పెళ్ళిచూపులు" చిత్రంలో విశేషంగా ఆశ్చర్యపరాచకపోయినా.. హుందాగా ఆకట్టుకొన్నాడు. మేకింగ్ పరంగా శేఖర్ కమ్ములను గుర్తుకు తెచ్చాడు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ విషయంలో శేఖర్ కమ్ములను కాపీ కొట్టినట్లుగా కనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ తప్పిస్తే సినిమా థీమ్ ను 2014లో వచ్చిన "ది చెఫ్" అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్లుగా ఉంది.
అయితే.. తనకు ఉన్న బడ్జెట్ పరిమితుల్లో టెక్నికల్ గా మంచి ఔట్ పుట్ తీసుకురావడంలో మాత్రం తరుణ్ భాస్కర్ వందశాతం విజయం సాధించాడు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

"ఫార్ములా సినిమా" అనే ఫార్మాట్ నుంచి తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. "టెర్రర్, క్షణం" లాంటి సినిమాల రిజల్ట్స్ డిఫరెంట్ మూవీస్ తీయాలనుకొనే యువ ప్రతిభాశాలులకు ఊపిరిపోసాయి. ఆ కోవకు చెందిన సినిమానే #పెళ్ళిచూపులు. గొప్ప సినిమా అని చెప్పలేం కానీ.. మంచి అనుభూతిని పంచే చిత్రం అని మాత్రం తప్పకుండా చెప్పుకోదగ్గ చిత్రం "పెళ్ళిచూపులు". సురేష్ బాబు లాంటి బడా నిర్మాత ఈ చిన్న చిత్రాన్ని సపోర్ట్ చేస్తుండడం, ఇప్పటికే ప్రివ్యూ షోల ద్వారా మంచి పాజిటివ్ బజ్ వచ్చి ఉండడం #పెళ్ళిచూపులు చిత్రాన్ని కామన్ ఆడియన్స్ కు విశేషమైన రీతిలో చేరువ చేసింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పలేం కానీ.. మల్టీప్లెక్స్ మరియు డిఫరెంట్ మూవీస్ ను ఆదరించే ప్రేక్షకులను మాత్రం అలరించగల అంశాలన్నీ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి.