Read more!

English | Telugu

సినిమా పేరు:పప్పు
బ్యానర్:ఆర్య ఎంటర్ టైన్ మెంట్‍
Rating:2.25
విడుదలయిన తేది:Jun 25, 2010
పప్పు (కృష్ణుడు) తానేపని చేసినా అది తనకే రివర్సయ్యేటటువంటి జాతకుడు. అంతా అతన్ని అన్ లక్కీ ఫెలో అంటూంటారు. అతను పనిచేసే కంపెనీ ఓనర్ లింగరాజు (బెనర్జీ) తన కుతురి పుట్టినరోజుకి ఆడి కారుని బహుమతిగా ఇస్తాడు. లింగరాజు ఏ పని చేసినా అతను బలంగా నమ్మే ఒక స్వామీజీని సంప్రదిస్తూంటాడు. లింగరాజు తమ్ముడు సింగరాజు (సూర్య) అన్న చెప్పిన మాట వినకపోవటం వల్ల వంద కోట్లకు మునిగిపోతాడు. అతను అన్న సాయం కోసం వస్తే స్వామీజీ వద్దనటంతో లింగరాజు అతనికి సహాయం చేయడు. ఇది జరిగాక తన ఉద్యోగులకు లింగరాజు ఇచ్చిన పార్టీ నుంచి అతని ఏకైక కుమార్తె రాధను ఎవరో కిడ్నాప్ చేస్తారు.ఆమెను వదలాలంటే వంద కోట్లు మూడురోజుల్లో ఏర్పాటుచేయాలనీ, లేకుంటే ఆమెను చంపేస్తామనీ వారు లింగరాజుని హెచ్చరిస్తారు. తన పి.ఎ.చిదంబరం (ఉత్తేజ్‍) సలహాతో డిటెక్టీవ్ రామ్ (సుబ్బరాజు)ని తన కుమార్తెను కాపాడ్డానికి నియమిస్తాడు. కానీ స్వామీజీ సలహాతో రాధకు శని దోషం ఉండటం వల్ల, బాగా నష్టజాతకుణ్ణి రామ్ తో పాటు రాధను కాపాడ్డానికి పంపితే ఫలితం బాగుంటుందని, పప్పుని రామ్ తో పాటు పంపుతారు. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ...
ఎనాలసిస్ :
గతంలో కృష్ణుడు శరీరాకృతిని విమర్శిస్తూ, దాని మీద శాడిస్టిక్ కామెడీని పండించిన చిత్రాలు ఇప్పటికే వచ్చాయి. ఈ చిత్రం అందుకు మినహాయింపేమీ కాదు. ఈ సినిమా మొదట్లో ఏదో సీరియల్ చూస్తున్నట్లుగా ఉంటుంది. కానీ సుబ్బరాజు ఎంటరయ్యిందగ్గర నుండీ కాస్త ఫరవాలేదు అనిపిస్తుంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తొలిసారి నిర్వహించిన సపన్ పసుమర్తి తలకు మించిన భారాన్ని ఎత్తుకున్నాడనిపించింది. అతను దర్శకత్వం మీద మాత్రమే ఏకాగ్రత చూపించి ఉంటే ఈ సినిమా ఇంకాస్త బాగా వచ్చేదేమో. ఏమైనా తొలిప్రయత్నంలో అతను ఫరవాలేదనిపించుకోవటం విశేషం. నటన -: కృష్ణుడు తన వరకూ తాను బాగానే నటించాడు. శ్రీదీపిక తొలి చిత్రమైనా బాగానే చేసింది. సుబ్బరాజు ఈ చిత్రానికి బాగా ప్లస్సయ్యాడు. అతను లేకపోతే ఈ సినిమా చూడటం అనవసరం. ఇక ఉత్తేజ్, బెనర్జీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం -: గొప్పగా లేకపోయినా,ఫరవాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి ఈ చిత్రంలోని పాటలు.రీ-రికార్డింగ్ కూడా అలాగే ఉంది. కెమెరా -: బాగుంది. పాటలు -: సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ -: ఫరవాలేదు. కొరియోగ్రఫీ -: ఫరవాలేదు. పాపం కృష్ణుడితో డ్యాన్స్ చేయించే ప్రయత్నం చేసిన అమ్మ రాజశేఖర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. యాక్షన్ -: ఈ సినిమాలో మూడే మూడు యాక్షన్ సీన్లున్నాయి. మూడూ బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా మీకేం తోచకపోతే ఏ ఇబ్బంది లేని సినిమా చూడాలనుకుంటే మీ కుటుంబంతో ఓసారి చూడొచ్చు.ఎందుకంటే ఇందులో ఎటువంటి అశ్లీలతా,అసభ్యతా లేవు కాబట్టి,పైగా కాస్తో కూస్తో కామెడీ కూడా ఉంది కాబట్టి.